ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల పర్వం నడుస్తోంది. ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్ లైఫ్ స్టోరీస్‌ను సినిమాటిక్‌గా తెరకెక్కిస్తున్నారు. దర్శకులు. తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో ఇలా చేసిన ప్రయోగాలు సక్సెస్ కూడా అయ్యాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మహానటి’ ఫిల్మ్ అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్. కాగా, మరికొన్ని బయోపిక్స్ త్వరలో రానున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో ప్రథమ భూదాతపై బయోపిక్ రాబోతున్నది. దాన్ని ఎవరు నిర్మించబోతున్నారో తెలుసా?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మాతగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే, ఆయన నిర్మించే తొలి చిత్రం చాలా స్ఫూర్తిదాయకంగా ఉండబోతున్నది. అదేంటంటే..భూదాన ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసి పలువురికి స్ఫూర్తిప్రదాతగా నిలిచిన తెలుగు వ్యక్తి వెదెరిరాంచంద్రారెడ్డి బయోపిక్. ఫ్రీ డమ్ ఫైట్‌లో గాంధీజి పాత్ర ప్రతీ ఒక్కరికి తెలుసు. కాగా, ఆయన ప్రియశిష్యుడైన వినోభాభావే పిలుపు మేరకు పోచంపల్లి గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి వంద ఎకరాలు దానం చేశాడు. ప్రథమ భూదాతగా ఖ్యాతి పొందాడు. ఆయన చేసిన భూమి దానం తర్వాత పలువురు పేదలకు భూములు పంచేందుకు ముందుకొచ్చారు.


అలా మొత్తంగా 58 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలపాలనే ఉద్దేశంతో సినిమా తీయబోతున్నట్లు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు నీలకంఠ దర్శకత్వం వహించనుండగా, రాంచంద్రారెడ్డి మనవడు అవరింద్ రెడ్డి సమర్పణలో ఫిల్మ్ నిర్మింపబడనుంది. ప్రజెంట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. త్వరలోనే నటీనటుల ఎంపిక ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తంగా అల్లు వారి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అర్జున్ అన్నయ్య బాబీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: