ముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. అయితే వీరు నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయిన వారిలో వడ్డే నవీన్ కూడా ఒకరు. అప్పట్లో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్ ,తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇక ఇప్పుడు  రీసెంట్ గా ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తొట్టెంపూడి వేణు కూడా రవితేజ నటించబోతున్న రామారావు చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడు. ఇక ఇదే తరుణంలో వడ్డే నవీన్ కూడా ఒక టాప్ హీరో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇప్పటి వరకు ఈయన ఏ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు.. అనే విషయాలు మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న వడ్డే నవీన్ , అంతే స్థాయిలో విజయాన్ని కూడా అందుకున్నాడు. కోరుకున్న ప్రియుడు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి,  ఆ తర్వాత నిర్మాతగా కూడా పని చేయడం జరిగింది. వడ్డే నవీన్ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకు. ఇక ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన పెళ్లి సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డే నవీన్.

అంతేకాదు ఈ సినిమాతో ఆయనకు రెండు అవార్డులు కూడా లభించాయి. ఇకపోతే పెళ్లి సినిమాతో మంచి క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్,  ఆ తర్వాత వరుస ఆఫర్లు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ తో సినీ కెరీర్ను కొనసాగించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్ తో ప్రేక్షకులకు కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: