సినీ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ జరుగుతూ అంటే కొంతమంది సెట్ లోకి షూటింగ్ ఎలా జరుగుతుందో..? అని చూడడానికి వెళుతూ ఉంటారు. మరికొంతమంది రంగు రంగుల దుస్తులను చూడటానికి ఇష్టపడతారు. ఇక మరికొంతమంది ఏమో వివిధ రకాల ప్రదేశాలను చూడవచ్చు.. అనే ఆలోచనతోనే సెట్ కి వెళుతూ ఉంటారు.. మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో సినిమా షూటింగ్ సెట్స్ లోకి వెళ్లడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం కేవలం అందుకే సినిమా సెట్స్ కి వెళ్లేదట. అయితే ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు సెట్ కి వెళ్ళేది..? అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..

హీరోయిన్ ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. ఇకపోతే ఈమె తండ్రి ప్రముఖ దర్శకుడిగా, నిర్మాతగా , రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ భట్ కూతురు ఈమె. ఆలియా భట్  తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ, తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇకపోతే ఆలియా భట్ మాత్రం ఒక నిజాన్ని బయట పెట్టింది. వాళ్ల నాన్న సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆమె కేవలం తినడం కోసం మాత్రమే షూటింగ్ సెట్స్ కి వెల్లేదట. అక్కడైతే రకరకాల వంటలు వడ్డిస్తారు అన్న ఒక్క కారణం తోనే , ఆమె సినిమా సెట్ కి వెల్లేదట. అయితే ఇటీవల ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో పంచుకుంది.

ఆలియా భట్ కు గ్రీన్ టీ అలాగే వేయించిన వేరుశనగ పప్పు అంటే చాలా ఇష్టమట. ఖాళీ సమయాల్లో ఆమె ఎక్కువగా వాటినే తింటుందని అభిమానులతో చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సినిమా సెట్ కి తినడానికి వెళ్తానంటూ ఆలియా భట్ చెప్పడంతో.. ఈమెకు తినడం అంటే చాలా ఇష్టం అని పలువురు అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: