ఒకానొక సమయంలో మునులకు దివ్య జ్ఞానమును ప్రసాదించు నారదుడు శ్రీమన్నారాయణను దర్శించడం కోసం వైకుంఠపురం కి వెళ్లి, అక్కడ నుండి తిరిగి వస్తుండగా గంధర్వ పురం మీదుగా భూలోకానికి వస్తున్నాడు. మార్గమధ్యంలో గంధర్వ గాయకుడైన తుంబురుడు , నారదుడిని కలిసి కుశల ప్రశ్నలు అడిగాడు. ఇక వీరిద్దరూ భూలోకాన్ని సమీపిస్తున్నారు . ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తుండగా ఇద్దరిమధ్య అనుకోకుండా ఒక వాదన వచ్చింది.

ఇద్దరూ ఒకరంటే ఒకరు మార్గం మధ్యలో.. నేను గొప్పంటే, నేను గొప్పని.. గొడవలు పడుతూ ఉన్నారు. ఇక ఆ ప్రాంతంలో ఎప్పుడూ హాయిగా తిరుగుతూ ఉండే బ్రహ్మచారి అయిన హనుమంతుడు వీరిని చూసి.. ఏమీ మీలో మీరు వాదులాడుకుంటున్నారు  అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి .." నేను దేవ గాయకుడు ను అని చెప్పాడు.. అప్పుడు తుంబురుడు  నేను గానగంధర్వుడి అని చెప్పాడు. ఇక హనుమంతుడు వీరిద్దరి వాదనలను విన్నాడు.


ఇక విని వారిద్దరితో మీరు ఎంత గొప్ప వాళ్ళో ..?  మీలో ఎవరు గొప్ప వాళ్ళు..?  అనే విషయాన్ని నేను నిర్ణయిస్తానని చెప్పాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద బండపై నారదుని వీణను వుంచి, హనుమంతుడు  గానం చేయగా , రాయి కరిగి ఆ వీణ ఇమిడిపోయింది. హనుమంతుడు వారితో.. మీలో ఎవరు గొప్ప వారో తెలియుటకు .. మీ గానంతో రాయిని కరిగించి, అందులో ఉన్న వీణను బయటకు తీయండి . అప్పుడు మీలో ఎవరు గొప్ప వారో నేను చెప్తాను  అని చెప్పాడు.


ఇక నారదుడు సర్వశక్తులా ప్రయత్నించి తన వల్ల కాదని చెప్పాడు. గంధర్వుడు కూడా అలసిపోయే వరకూ గానము చేసి , నా వల్ల కాదు అని కూడా అన్నాడు. ఆ తరువాత హనుమంతుడు గానము చేసి , రాయిని  కరిగించి అందులో ఉన్న వీణను బయటకు తీశాడు. ఆ వీణను  నారద మహర్షికి ఇచ్చి,  ఎప్పుడూ కూడా వాదన లాడవద్దని మందలించాడు. ఇక వీరిద్దరూ సిగ్గుపడి, హనుమంతుడికి నమస్కరించి,  అక్కడి నుంచి వెళ్లిపోయారు . కాబట్టి మనం ఎంత వారిమైననూ గర్వ పడకూడదు. మనకన్నా  అధికులు కచ్చితంగా ఉంటారు అని గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: