కొవిడ్ ఎఫెక్ట్ సినిమా రంగంపై బాగా పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కరోనా పుణ్యమాని థియేటర్లు నెలల పాటు మూతపడే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఓపెన్ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఆగమ్యగోచరంగానే ఉంది. ఒకవేళ ఏపీ సర్కారు థియేటర్ల ఓపెనింగ్‌కు అనుమతి ఇచ్చినా టాకీసుల యాజమాన్యాలు తెరవడానికి ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. యాభై శాతం ఆక్యుపెన్సీ, తగ్గిన టిక్కెట్ ధరలతో సినిమాలు రిలీజ్ చేస్తే నష్టాలు తప్ప లాభాలు అస్సలు ఉండబోవనే ఆందోళన ఏపీ ఎగ్జిబిటర్లలో బలంగా ఉంది.  ఈ క్రమంలోనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని థియేటర్ యాజమాన్యాలు, ప్రొడ్యూసర్స్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ విషయాలపై జగన్ సర్కారు స్పందించే అవకాశం లేదనే ప్రచారం సాగుతున్నది. అక్టోబర్ నెల వరకు కూడా సీఎం జగన్ ఎలాంటి వెసులుబాట్లు కల్పించబోరని సమాచారం.

ఈ లెక్కన ఆగస్టులోనూ ఏపీలో చిత్రాల విడుదల ఉండబోదు అని అంచనా వేసుకోవచ్చు. ఇందుకు కరోనాయే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం థర్డ్ వేవ్ ఎఫెక్ట్స్ మళ్లీ షురూ అవుతున్నాయని, ఈ క్రమంలోనే పరిస్థితులు సర్దుకున్నాక ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లను చర్చలకు పిలిచే అవకాశముంటుంది. టికెట్ల ధరలపై పెంపుపై సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే పలు పెద్ద సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్‌ను మూవీ యూనిట్ మొత్తం ఎంజాయ్ చేస్తోంది. ఇక వెంకటేశ్ నెక్స్ట్ మూవీ ‘దృశ్యం-2’ కూడా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్? ఈ క్రమంలోనే సినిమాలన్నీ డిజిటల్ రిలీజ్ అయితే థియేటర్ల యాజమాన్యాల పరిస్థితి కష్టమే. అయితే, మూవీలు టాకీసుల్లో రిలీజ్ అయితేనే ఎంజాయ్‌మెంట్ ఉంటుందని పలువురు యంగ్ హీరోలు పేర్కొంటుడటం విశేషం. సినిమా అంటే థియేటర్ అనేంతలా ప్రజల్లో, ప్రేక్షకుల్లో బలమైన ఫీలింగ్ ఉంటుందని వారు వివరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: