సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మనం పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయన గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రీకాంత్ గురించి కూడా సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. మెగాస్టార్ చిరంజీవి లాగే సినీ ఇండస్ట్రీలోకి ఎవరు సపోర్ట్ లేకుండా , ఉన్న టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదిగి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు శ్రీకాంత్. ముఖ్యంగా ఆ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు అలాగే యూత్ కి తన సినిమాలతో, బాగా ఆనందాన్ని పంచేవాడు. అంతేకాకుండా ఈయనకు దక్షిణ భారతదేశమంతా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఈయన భార్య ఊహ కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి, ఆమె కూడా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంది.

ఇక శ్రీకాంత్ కొడుకు  రోషన్ కూడా నిర్మలా కాన్వెంట్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇకపోతే శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ తో విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంతేకాదు ఒకపక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల చిరంజీవి  లేకపోతే తన జీవితం ఏమైపోయేదో అని వివరించాడు శ్రీకాంత్. అసలు శ్రీకాంత్ జీవితం ఏమైంది..? ఏ విషయంలో చిరంజీవి ఆదుకున్నాడు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీకాంత్ తను ఎదుర్కొన్న సంఘటనలను తలచుకుంటూ ఇలా వివరించాడు.." ఒకానొక సమయంలో ముఖ్యంగా నా సినీ కెరియర్ బాగా రేసుగుర్రంలా దూసుకుపోతున్న అప్పుడు , ఒకే సంవత్సరంలో 7 సినిమాలలో హీరోగా నటించాను. అయితే అన్ని సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. ఒక్కసారిగా భయపడిపోయి ఇక సినిమాలకు దూరం అవ్వాలి అనుకున్నాను.. అంతే కాదు నేను నటించే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నానా..? హీరోగా నా సినీ జీవితం ఇక ముగిసిపోయినట్లేనా..? ఇంత తొందరగా నా సినీ జీవితం ముగియడం ఏంటి..? అనే ఎన్నో అనుమానాలు నాలో ఎదురయ్యాయి..

ఇక మా ఊరు వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు తీవ్ర మనస్థాపానికి కూడా లోనయ్యాను. నా పరిస్థితి ని చూసిన చిరంజీవి అన్నయ్య నన్ను బాగా ఓదార్చి , ధైర్యం కూడా చెప్పాడు. అంతేకాదు మళ్ళీ సినిమాలు చేయడం ప్రారంభించు, ఖచ్చితంగా సక్సెస్ ను పొందుతావు.. అంటూ తెలపడంతో మళ్ళీ నా సినీ జీవితాన్ని మొదలు పెట్టాను" అని చెప్పాడు శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: