సూపర్ స్టార్ మహేష్ తో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో పోషించని ఒక విభిన్న పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా యువ భామ కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ సంగీతాన్ని మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలైన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సముద్ర ఖని పోసాని కృష్ణమురళి, తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ చెవికి పోగు, మెడమీద రూపాయి కాయిన్ ట్యాటూతో ఉన్న ఆ పోస్టర్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే మరొక పదిరోజుల్లో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా నేడు మూవీ యూనిట్, సర్కారు వారి పాట నుండి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. రెడ్ కలర్ కారు లోనుండి పూర్తి రగ్డ్ లుక్ లో హాలీవుడ్ హీరోలా దిగుతూ మెరిసిపోతున్న సూపర్ స్టార్ ని చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు.

మంచి మెసేజ్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నేడు విడుదలైన పోస్టర్ లో ఆగష్టు 9న మహేష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన బర్త్ డే బ్లాస్టర్ ని విడుదల చేస్తున్నట్లు తెలిపిన యూనిట్, తమ సినిమాని 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది. మరి రేపు సంక్రాంతి రానున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి .... !!




మరింత సమాచారం తెలుసుకోండి: