అప్పట్లో మన సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కథ, కథనం బాగుంటేనే హీరోలు సినిమా చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇక అంతే కాదు వారు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ప్రేక్షకులలో సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ, ప్రేక్షకుల దగ్గరకు మంచి కథలతో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు భిన్న విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు కనిపించి,  వీరి ఇమేజ్ ను మరింత పెంచుకుంటూ ఉంటారు. ఇకపోతే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున,  వెంకటేష్ వంటి స్టార్ హీరోలు కూడా ప్రేక్షకుల కోసం అహర్నిశలు కష్ట పడిన వారే..

అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలు తీయాల్సి ఉంటుంది. ఈ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఎవరిని ఎలా ఆదరిస్తారో చెప్పడం కష్టం అని అంటున్నారు మరి కొంతమంది హీరోలు.. చెప్పాలంటే తెలుగు సినీ ప్రేక్షకులు కొత్త హీరోలను బాగా ఆదరిస్తారు.. వారికి కూడా అవకాశం కల్పిస్తారు అనేది వినికిడి. అయితే ఇక స్టార్ హీరోల పరిస్థితే ఇలా ఉంటే, మరి ఐటమ్ గర్ల్ సంగతేంటి.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది నటులు,  ఐటం గర్ల్స్ ను వివాహం చేసుకొని,  అందరికీ ఆదర్శంగా మిగిలారు.

1.జెడి.చక్రవర్తి - అనుకృతి శర్మ:
దర్శకుడిగా,  నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జె.డి.చక్రవర్తి నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరించాడు. అయితే ఈయన  శ్రీదేవి సినిమాలో వ్యాంప్  క్యారెక్టర్ లో నటించిన అనుకృతి శర్మ ను వివాహం చేసుకున్నారు.

2. శ్రీహరి - డిస్కో శాంతి:
విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, అప్పట్లో బాగా గుర్తింపు పొందిన ఐటమ్ గర్ల్ డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఎలాంటి పాత్రలలో  నటిస్తేనేమి,  మనసు మంచిది అయితే చాలు.. అంటూ వీరు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: