బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్తకు సంబంధించిన కేసు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ అడల్ట్ కంటెంట్ కేసుపై రోజుకో రచ్చ జరుగుతోంది. దీనిపై పలువురు సెలెబ్రిటీలు బయటకు వచ్చి చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. అంతేకాకుండా ప్రతి రోజూ రాజ్ కుంద్రా కేసుకు సంబంధించిన అప్డేట్ బయటకు రావడంతో... ఏ రోజుకారోజు అవి ముఖ్యాంశాలుగా నిలుస్తున్నాయి. ఇక ఈ అశ్లీల లీలల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన ఎఫెక్ట్ శిల్పాశెట్టి మూవీ కెరీర్ పై కూడా పడుతోంది. ఇప్పటికే వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పడుతున్న ఆమెకు వృత్తిపరంగా కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. తాజాగా శిల్పాశెట్టి నటించిన 'హంగామా 2' విడుదలైంది. అయితే సినిమాకి ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రావడం లేదు. భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం, అశ్లీల కేసులో చిక్కుకోవడం వల్ల ఈ సినిమా దారుణంగా దెబ్బతింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ చిత్రం 'హంగామా 2' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 23 జూలైలో ప్రదర్శించబడింది.

అశ్లీల కేసులో రాజ్ కుంద్రా పేరు తెరపైకి రావడంతో ఈ సినిమా చాలా నష్టపోయిందని సమాచారం. సోషల్ మీడియాలో ఈ సినిమాను బహిష్కరిస్తారనే ప్రచారం కూడా జరిగింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపదని డిస్నీతో పాటు చిత్రబృందం కూడా అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. శిల్పా శెట్టి భర్త అరెస్టు కారణంగా "హంగామా 2" కనీసం 15 శాతం మంది వీక్షకులను కోల్పోయింది. శిల్పా 14 సంవత్సరాల తర్వాత ఈ చిత్రంతోనే తిరిగి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భర్త చేసిన తప్పుకు ఆమెకు శిక్ష అనుభవించక తప్పడం లేదు. ఇప్పుడు 'హంగామా 2' రెస్పాన్స్ చూసి శిల్పా శెట్టి రెండవ చిత్రం 'నికమ్మ' టీమ్ పూర్తిగా భయపడిపోయింది. ఈ కారణంగా సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: