హీరో అంటే ఉదాత్త భావాలతో ఉండాలి. చక్కగా షేవ్ చేసుకుని కనిపించాలి. స్మూత్ గా ఉండాలి. ఇక తెల్లగా ఉంటూ హీమాన్ అనిపించుకోవాలి. అందరికీ మంచి చేస్తూ మంచి వాడు అన్న ట్యాగ్ తో ఉండాలి. ఇదంతా పాత కాలం రోజుల నాటి హీరో లక్షణాలు. అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల నాటి హీరో అన్న మాట.

గత కొన్నేళ్ళుగా హీరో అంటే అర్ధాలు మారిపోయాయి. హీరో రఫ్ గా ఉండడమే కాదు విలన్ల కంటే కూడా ఒక్కోసారి భయంకరంగా కనిపిస్తున్నారు. ఆయన పాత్రను ఎంత అరాచ‌కంగా డిజైన్ చేస్త అంతలా మాస్ అప్పీల్ దక్కుతోంది. ఇక టైటిల్స్ కూడా అలాగే ఉండాలి. ముఖ్యంగా  ఆ టైటిల్ చూస్తేనే హీరో గారి విలన్ లక్షణాలు తెలిసిపోవాలి. దాంతో కొన్నేళ్ళుగా హీరో కి విలన్ కి మధ్య తేడా ఏమీ తెలియడంలేదు. కాకపోతే హీరోగా వేసే వారు స్టార్లు హీరోలు కాబట్టి అతను చేసేది అంతా మంచే అనుకోవాలి.

ఇక టాలీవుడ్ లో చూసుకుంటే క్రిష్ణంరాజు తో మొదలుపెడితే మోహన్ బాబు, చిరంజీవి, శ్రీకాంత్, శ్రీహరి ఇలా చాలా మంది విలన్ల నుంచే హీరోలుగా ఎదిగారు. ఇపుడు వారిలో చాలా మంది హీరోల నుంచి విలన్లుగా కూడా మారుతున్నారు. బాలయ్య అఖండ మూవీలో ఫస్ట్ టైమ్ శ్రీకాంత్ విలన్ గా వేస్తున్నాడు. అంతకు ముందు లెజెండ్ మూవీలో జగపతి బాబు విలన్ అయ్యాడు. లేడీస్ ఫాలోయింగ్ బాగా ఉన్న జగపతి బాబు పక్కా విలన్ గా ఇపుడు అదరగొడుతున్నాదు. ఇక ఒకనాడు ఫ్యామిలీ హీరోగా ఉన్న శ్రీకాంత్ కూడా ఇక మీదట విలన్ గా గర్జిస్తాడు అనుకోవాలి. వీరితో పాటు కార్తికేయ అనే యంగ్ హీరో కూడా విలన్ వేషాలు వేస్తున్నారు. ఆయనకు పాత్ర నచ్చితే చాలు విలన్ కైనా రెడీ అంటున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన్నలో విలన్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అంటే ఇపుడు హీరో విలన్లు అన్నది లేదు. ఎవరికైనా నటన బాగుంటే నటించే స్కోప్ ఉంటే జనాలు బ్రహ్మరధం పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: