ఎన్టీయార్ అంటేనే తెలుగు సినిమా వైభవం కళ్ల ముందు కనిపిస్తుంది. ఆయన చేయని పాత్ర లేదు. టచ్ చేయని జానర్ లేదు. ఎన్టీయార్ ఫస్ట్ సాంఘిక చిత్రాలు ద్వారానే వెండి తెరకు పరిచయం అయినా కూడా ఆయన పౌరాణికాలు, జానపదాలలో కూడా తనకు సాటి లేదు అనిపించుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీయార్ రాముడు క్రిష్ణుడుగా తెలుగు వారికి కనిపిస్తారు. ఆ పాత్రల చిత్రాలను ఇంట్లో పెట్టుకుని పూజించేవారు ప్రతి తెలుగింటిలోనూ ఉంటారు. ఇక ఎన్టీయార్ పోషించిన మరో దైవ పాత్ర శ్రీ వెంకటేశ్వరస్వామి. కలియుగ దైవంగా అన్న గారు పాత్ర పోషితే సాక్షాత్తూ ఆ ఏడుకొండల వాడు దిగివచ్చినట్లుగా అంతా భావించేవారు. వెంకటేశ్వరుని పాత్రలో ఎన్టీయార్ జీవిస్తారు అని పేరు.

ఆయన  అలా చేసిన అనేక చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే పౌరాణికాలకు కాలం చెల్లుతున్న రోజుల్లో ఎన్టీయార్ 1979 ప్రాంతంలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం పేరుతో తన సొంత బ్యానర్ మీద సినిమా తీశారు. తానే నిర్మాతగా, దర్శకుడిగా నటుడిగా ఎన్టీయార్ ఈ మూవీ తీశారు. ఇందులో శ్రీదేవిగా జయసుధ నటిస్తే పద్మావతిగా జయప్రద, నారదుడిగా బాలక్రిష్ణ నటించారు.

ఈ మూవీలో పాటలు చాలా బాగుంటాయి. ఎన్టీయార్ కూడా అన్ని అంశాలు మిళాయించి చక్కగా దర్శకత్వం నెరిపారు. అయితే ఈ మూవీ రిలీజ్ చేస్తే అనుకున్న విజయం సాధించలేదు. అప్పటికే ఎన్టీయార్ని అడవిరాముడుగా, డ్రైవర్ రాముడిగా, యమగోలలో మాస్ హీరోగా చూసిన జనాలు శ్రీ వెంకటేశ్వరునిగా దర్శనం ఇస్తే పెద్దగా ఆదరించలేదు. దాంతో ఈ సినిమా రిజల్ట్ ఎన్టీయార్ కి గట్టి షాక్  ని ఇచ్చింది. ఈ పరిణామంతో బాధపడిన ఎన్టీయార్ ఇక మీదట పౌరాణికాలు తీయను అంటూ శపధం చేశారు. ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నారు కూడా. బ్రహ్మర్షి విశ్వమిత్ర వంటివి తరువాత రోజులలో  తీసినా కూడా  మళ్ళీ దేవుడి పాత్రల జోలికి మాత్రం ఎన్టీయార్ పోలేదు అంటే ఆయన మారుతున్న జనాల అభిరుచి మీద ఎంతలా బాధపడ్డారో అర్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: