టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒక్కో సినిమాతో సంగీత దర్శకుడిగా తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న ఎస్ ఎస్ థమన్ తొలిసారిగా దర్శక దిగ్గజం శంకర్ తీసిన బాయ్స్ మూవీలో నటుడిగా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేసారు. ఆ తరువాత సంగీత దర్శకుడిగా తొలిసారిగా భీభత్సం సినిమా తో ఎంట్రీ ఇచ్చిన థమన్, ఆ తరువాత రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తీసిన కిక్ మూవీ తో సూపర్ హిట్ కొట్టారు. అలానే ఆ సినిమాలోని సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న థమన్, ఆపై మహేష్ బాబు దూకుడు, ఎన్టీఆర్ బృందావనం వంటి మరొక రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు. ఇక అక్కడి నుండి థమన్ కు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఇటీవల సరైనోడు, తొలిప్రేమ, మహానుభావుడు, అలానే గత ఏడాది భారీ విజయం సొంతం చేసుకున్న అలవైకుంఠపురములో సినిమాల్లోని సాంగ్స్ తో మరితంగా పాపులర్ అయ్యారు థమన్. ప్రస్తుతం థమన్ చేతిలో చాలా వరకు పెద్ద సినిమాలు ఉన్నాయి.

మహేష్ బాబు తో సర్కారు వారి పాట, తదుపరి త్రివిక్రమ్ మూవీ, పవన్ కళ్యాణ్ రానా ల సినిమా, రామ్ చరణ్ శంకర్ మూవీ, బాలయ్య తో అఖండ, తదుపరి గోపీచంద్ మలినేని సినిమా, మెగాస్టార్ చిరంజీవి తో లూసిఫర్ తెలుగు రీమేక్, వీటితో పాటు మరికొన్ని సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు థమన్. అయితే థమన్ చేతిలో ఇంత భారీగా సినిమాలు ఉండడంతో వాటిలో ఏ సినిమాకి ఆయన సరిగ్గా మ్యూజిక్ అందించకపోతే ఆయా సినిమా హీరోల ఫ్యాన్స్ నుండి కొంత నెగటివిటీ తో ఫసక్ ఎదుర్కొనక తప్పదని, అందుకే తదుపరి తాను చేస్తున్న ఈ సినిమాలన్నిటి పై థమన్ మంచి శ్రద్ధ పెట్టి మ్యూజిక్ అందిస్తే రాబోయే రోజుల్లో సంగీత దర్శకుడిగా ఎవరికీ అందనంత స్థాయికి ఎదగడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: