మిల్కీ బ్యూటీ తమన్నా ఫుల్ బిజీ లో ఉన్నారు. వరుస సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం, సిటీమార్, మ్యాస్ట్రో సినిమాలలో ఆమె నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఇవి కాక మరో ఐటెం సాంగ్ లో కూడా ఆమె అలరించనున్నారని సమాచారం . గతం లో సినిమాల్లో పరిస్థితిని  బట్టి, సాంగ్స్ లోను కుర్రకారు ని చిర్రెత్తించిన తమన్నా ఇక ఐటెం సాంగ్ లో మెరువనున్నారు అంటే ఫాన్స్ కి ఇక పండగే.

వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న "గని" చిత్రం లో తమన్నా ఐటమ్ సాంగ్ లో నర్తించనున్నారట. ఐతే.. ఇందుకోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అంటే అక్షరాలా 75 లక్షలు. తమన్నా ఓ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటిస్తోన్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తార సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నా అంగీకరించినట్లు ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. "వరుణ్‌తేజ్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ చాలా సంతోషం. అతనితో డాన్స్  చేయడానికి ఎదురుచూస్తున్నా. నిజంగా ఆ సాంగ్ చాలా సూపర్ గా ఉంటుంది. కథలో ఒక ఆసక్తికర సమయంలో ఆ సాంగ్ వస్తుంది." అని చెప్పింది తమన్నా. తమన్ ట్యూన్స్ ఇచ్చిన ఈ సాంగ్‌కు షాజియా సాంజీ, పీయుష్ భగత్ సంయుక్తంగా కొరియోగ్రఫీ అందించనున్నారు. వరుణ్‌తేజ్‌, తమన్నా స్క్రీన్  పంచుకోవడం ఇదే తొలిసారి కాదు.ఇంతకు ముందు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 2'లో కలిసి నటించారు. అందులో వరుణ్ వదినగా, వెంకటేశ్ భార్యగా తమన్నా నటించింది. ఇప్పుడు మరోసారి అవే పాత్రల్లో వారు 'ఎఫ్ 3'లో నటిస్తున్నారు. తెలుగులో తమన్నా పలు సినిమాలతో చాలా బిజీగా ఉంది.

నితిన్‌తో కలిసి నటించిన 'మేస్ట్రో', గోపీచంద్ జోడీగా నటించిన 'సీటీమార్‌', సత్యదేవ్ సరసన చేసిన 'గుర్తుందా శీతాకాలం' సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా రిలీజ్ కానున్నాయి. ఇవి కాకుండా బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీతో 'బోల్ చుడియా' సినిమా చేస్తోంది. అలాగే జెమినీ టీవీ కోసం 'మాస్టర్ చెఫ్ ఇండియా' తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా చేస్తోంది. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతోంది.మరి చూడాలి తమన్నా ఇంకేం విశేషాలు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: