సాధారణంగా సంక్రాంతి సీజన్ సినిమాలకు సంబంధించిన క్లారిటీ నవంబర్ నెల ప్రాంతంలో వస్తూ ఉంటుంది. అయితే 5 నెలలు తరువాత రాబోతున్న సంక్రాంతి పండుగ సినిమాల క్లారిటీ ఇంత ముందుగా రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. జనవరి 14న ప్రభాస్ ‘రాథే శ్యామ్’ విడుదల అవుతున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదలైంది.


దీనితో ఎలర్ట్ అయిన మహేష్ ‘సర్కారు వారి పాట’ యూనిట్ తమ మూవీ డేట్ ను 13 జనవరిగా ప్రకటించి సంక్రాంతి వార్ కు తెర తీసారు. సాధారణంగా సంక్రాంతికి కనీసం మూడు సినిమాలు రావడం సాంప్రదాయం. అయితే ఈసారి సంక్రాంతికి 4 భారీ సినిమాలు విడుదల అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ రానా కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ విడుదల కూడ సంక్రాంతి సీజన్ లోనే ఉంటుంది.



ఇప్పటికే ఈమూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా రానా తన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని అమెరికా వెళ్ళాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో మళ్ళీ రానా ఆరోగ్యం పై అనేక రూమర్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎటువంటి సమస్యలు లేకుండా రానా మళ్ళీ త్వరలో హైదరాబాద్ కు తిరిగి వస్తే ‘అయ్యప్పన్ కోషియమ్’ షూటింగ్ అనుకున్న విధంగా పూర్తి చేసుకుని సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుంది. అప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి వార్ ప్రభాస్ మహేష్ పవన్ ల మధ్య ఉండబోతుంది.


అయితే సంక్రాంతి రేస్ కు రెండు భారీ సినిమాలు వస్తేనే ధియేటర్లు దొరకడం కష్టం. అలాంటిది రాబోతున్న సంక్రాంతికి ఏకంగా మూడు భారీ సినిమాలు విడుదల అయితే ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమూడు సినిమాలు చాలవు అన్నట్లుగా దిల్ రాజ్ తన ‘ఎఫ్ 3’ ని కూడ సంక్రాంతి రేస్ కు రెడీ పెడుతున్నారు అని అంటున్నారు. దీనితో ఈనాలుగు సినిమాలలో ఏసినిమా ఎవరికోసం రాజీ పడిపోతుంది అన్నవిషయమై ఇప్పటి నుంచే  ఊహాగానాలు మొదలయ్యాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: