ఒక సినిమా మంచి సక్సెస్ ఫుల్ ను అందుకోవాలంటే అందులో కథ, కథాంశం రెండూ ముఖ్యమే. అయితే మన రచయితలు ఈ కథను రాసుకునే ముందు ఎవరో ఒకరిని, ఏదో ఒక సందర్భాన్ని.. మనసులో తలచుకుని రాయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కథకు ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఇక్కడ ఒక రచయిత అలాగే ఒక స్టార్ డైరెక్టర్ తండ్రి తన కథలు రాసేటప్పుడు, చందమామ కథలను స్ఫూర్తిగా తీసుకొని, తన కథలను సృష్టించుకోవడం మొదలుపెడతాడు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆ రచయిత ఎవరు..? ఆ సినిమా ల విశేషాలు ఏమిటి ..? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..


అతనెవరో కాదు.. బాహుబలి లాంటి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇక ఈయన మన భారతదేశంలోనే సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న ప్రముఖ సినీ కథా రచయితగా గుర్తింపు పొందారు..ఇకపోతే  ప్రస్తుతం ఈయన పై అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి.. అది ఏమిటంటే, విజయేంద్రప్రసాద్ నిజానికి రైటర్ కారా ఆయన ఏం చేస్తూ ఉంటారు..?  అని సందేహం కొందరిలో తలెత్తుతోంది. అయితే ఇదే విషయాన్ని ఆయనను అడగగా,  ఆయన ఇచ్చిన సమాధానానికి అందరూ ఫిదా అయిపోయారు..

దానికి విజయేంద్రప్రసాద్ ఎప్పుడూ కూడా కథలు రాయడానికి పేపర్,పెన్  ఉపయోగించిన రోజేలేదని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. అంతేకాదు ఆయన కథలు ఏవైనా రాయాలి అనుకుంటే , అవన్నీ ఆయన మైండ్ లో నే మొదలవుతాయట. తన మైండ్ లో ఉన్న కథను దర్శకుడు వినిపిస్తే , కచ్చితంగా ఓకే చేస్తారట. ఇవన్నీ విషయాలను కేవలం విజయేంద్రప్రసాద్ స్వయంగా  ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే తనను రైటర్అనే కంటే అని నెరేటర్ అని  పెడితే చాలా బాగుంటుంది అని ఆయన అన్నారు.

ఇంతలా బ్లాక్ బాస్టర్ మూవీస్ కథలు రాయడం అంటే అంత ఆషామాషీ కాదు. ఇన్ని ఆలోచనలు ఆయనకు ఎక్కడి నుంచి వస్తాయని అడగగా,  ఆయన చెప్పిన సమాధానం ఒకటే.. తన చిన్ననాటి చదివిన చందమామ పుస్తకాలను స్పూర్తిగా తెలుసుకొని కథలను తెరకెక్కిస్తారు. అందుకే అంత గొప్పగా ఉంటాయని ఆయన అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: