టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా సంగీత దర్శకుడిగా హాస్య చిత్రాల కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్ కు ఎంతో గొప్ప పేరు ఉంది. ఎన్నో హాస్యభరితమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన సినిమాల్లో ఆహనాపెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు ఏప్రిల్ 1 విడుదల సినిమా లు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాలానికి అనుగుణంగా మారుతూ రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ తన నటనా కౌశలంతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వస్తున్నాడు.

కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ ప్రభావం తనపై ఉండడంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎర్రమందారం సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం తొలిసారిగా అందుకున్నారు. ఆ తర్వాత మేడం సినిమాలో నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఆ నలుగురు సినిమా 2004 సంవత్సరానికి ఆయన ఉత్తమ నంది నటుడు గా ఎంపిక కాగా 2015 లో జరిగిన ఎన్నికలలో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

అలాగే క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ లో కూడా నటించిన టాలీవుడ్ హీరో గా రికార్డులకెక్కాడు. హీరోగా తనకు సినిమా అవకాశాలు తగ్గుతున్న టైం లో స్టార్ హీరోల సరసన, యంగ్ హీరోల సరసన తండ్రి పాత్రలకు పాత్రలు చేయడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా కమెడియన్ గా కూడా చేయడానికి ఆయన ఏమాత్రం వెనకాడలేదు. ఇటీవలే ఆయన ప్రత్యేక పాత్ర పోషించిన జాలిపడి సంపత్ సినిమా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది రాజేంద్రుడు-గజేంద్రుడు, చెవిలో పువ్వు,  హిట్లర్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.  భవిష్యత్ లో ఈ నటుడి నుంచి ఇంకా మంచి పాత్రలు చూడొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: