గత కొంతకాలంగా చూసుకుంటే సినిమా పరిశ్రమలో కొత్త టాలెంట్ ముందుకు రావడం, సక్సెస్ అవడం మనకు కనిపిస్తుంది. గతంలో హీరోలు నిర్మాతలు దర్శకుల వారసులు మాత్రమే  తెరపై సందడి చేసే వారు. వారిలో కూడా టాలెంట్ ఉన్న వారు మాత్రమే పైకి ఎదిగారు. మిగితా వారు కనుమరుగైపోయారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ ఉంటేనే ఎదుగుతారు, బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే స్టార్ లు అవుతారు అనే నానుడి ని కొంతమంది తుడిచి పెట్టేశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి సర్వే చేయడం అంటే అంత చిన్న విషయం కాదు.

 కానీ గత పదేళ్లలో భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో మంది నటులు హీరోలుగా స్టార్లుగా రాణిస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో భవిష్యత్తు మెగాస్టార్ గా పిలువబడుతున్న విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సొంత కష్టంతో స్టార్ గా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు. అలాగే టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న నాని రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక చిన్న సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ హీరో టాలెంట్ కు నిదర్శనం గా మారి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు.

కోలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవరి సపోర్టు లేకుండా పైకి వచ్చిన హీరోల్లో మొదట చెప్పుకోవాల్సిన హీరో విజయ్ సేతుపతి. అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగాడు ఇప్పుడు విజయ్ సేతుపతి డేట్స్ కోసం నిర్మాతలు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కన్నడలో తొలి పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన యశ్ అక్కడి వారసత్వాన్ని తట్టుకొని స్టార్ హీరో అయ్యాడు. కోలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన మరొక హీరో శివ కార్తికేయన్. మలయాళ సినిమా పరిశ్రమలో నివిన్ పాలీ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి స్టార్ హీరో అయ్యాడు. ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సినిమాలు చేసుకుంటూ వచ్చి స్టార్ హీరోగా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: