ప్రముఖ సీనియర్ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. చక్కని నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన రంగులరాట్నం చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. మొదటి చిత్రంలోనే తన అద్భుతమైన నటన చాతుర్యాన్ని చూపించే ఉత్తమనటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. విలక్షణమైన పాత్రల్లో నటించిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుమారు 180 సినిమాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. దాదాపు 750 సినిమాల్లో సహాయ నటిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది వావ్ అనిపించారు.

పదహారేళ్ళ వయసు చిత్రంలో ఆయన నటనకు గానూ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇక రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి కామెడీ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోగా నటించి కడుపుబ్బా నవ్వించారు. 1996వ సంవత్సరం నుంచి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. వయసు పైబడిన తర్వాత ఆయన ఎక్కువగా హీరో, హీరోయిన్ తండ్రి, అంకుల్ పాత్రలలో నటించారు. చందమామ రావే చిత్రంలో ఆయన హాస్య నటన కు ఉత్తమ కమెడియన్ గా నంది అవార్డు కూడా లభించింది.

తమ్ముడు, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు, ఒక్కడు, సెవెన్ జి బృందావన కాలనీ తదితర సినిమాలలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులందరూ అబ్బురపడ్డారు. అతనొక్కడే సినిమాలో అతని ఉత్తమమైన నటనను గుర్తించి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డుతో సత్కరించారు. ఢీ, రెడీ, శంభో శివ శంభో, యముడికి మొగుడు చిత్రాల్లో కూడా ఆయన విలక్షణమైన పాత్రల్లో నటించి తన క్రేజ్ ని మరింత పెంచుకున్నారు. అయితే హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నారని టాలీవుడ్ ప్రేక్షకులు అంటుంటారు. ఆయన ఆఖరిగా 2017లో వచ్చిన ఆక్సిజన్ సినిమాలో నటించారు. ఆయనకు ఇప్పుడు 76 సంవత్సరాలు కాగా.. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలనుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: