బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కు ఇటీవల ఓ షోలో "నువ్వు వర్జిన్ వా ?" అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు టైగర్ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే ఎపిక్ రిప్లై ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే... అర్బాజ్ ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న టాక్ షో "క్విక్ హీల్ పించ్ బై అర్బాజ్ ఖాన్" సీజన్ 2 మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ సీజన్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా వంటి అతిథులు ఈ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మూడవ ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు, నటుడు టైగర్ ష్రాఫ్ పాల్గొన్నాడు. అర్బాజ్ ఖాన్ ఈ టాక్ షో మూడవ ఎపిసోడ్ కొత్త ప్రోమో వీడియోలో టైగర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి తన లుక్స్ కోసం తాను ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి అడిగాడు. ఒక నిమిషం పాటు సాగిన ఈ ప్రోమో వీడియోలో అర్బాజ్ టైగర్ ష్రాఫ్‌పై సోషల్ మీడియా యూజర్లు చేసిన కొన్ని దారుణమైన ట్రోలింగ్ గురించి ప్రశ్నించాడు.

టైగర్ తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో తన లుక్స్ కోసం చాలా ద్వేషాన్ని అందుకున్నట్లు ఒప్పుకున్నాడు. టైగర్ 'హీరోపంతి'లో కృతి సనన్‌తో హిందీ చిత్ర అరంగేట్రం చేశాడు. కానీ ఆ చిత్రంలో టైగర్ ను చూసిన ప్రేక్షకులు అతన్ని హీరో అనడం కంటే హీరోయిన్ అనడం బెటర్ అంటూ ట్రోల్ చేశారు. అయితే ప్రోమోలో టైగర్ చెప్పినట్లుగా అతను తన శక్తి మేరకు ప్రయత్నించి యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇటీవలి కాలంలో అత్యంత బ్యాంకింగ్ యాక్షన్ స్టార్స్ లో టైగర్ కూడా ఒకడన్న విషయం జగమెరిగిన సత్యం. గడ్డం మినహా మీకు అన్నీ ఉన్నాయి? అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ గురించి ప్రశ్నించగా టైగర్ తన గడ్డం ముఖం వైపు చూపించి ఇది ఏమిటి ? అని ప్రశ్నించాడు. ఇక అతి ముఖ్యమైన ప్రశ్న "నువ్వు వర్జిన్ వా ?" అని అర్బాజ్ ప్రశ్నించగా... "సల్మాన్ భాయ్ లాగా నేను కూడా వర్జిన్ నే" అంటూ సల్మాన్ వైరల్ డైలాగ్ తో చమత్కరించాడు. గతంలో "కాఫీ విత్ కరణ్‌"లో సల్మాన్ ఖాన్ "నేను వర్జిన్" అని చెప్పడం ట్రోలింగ్ కు దారి తీసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: