కొత్తకొత్త అందాలతో టాలీవుడ్ పులకించి పోతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ భామలు తెలుగు ఇండస్ట్రీని ఏలేందుకు సిద్ధమవుతున్నారు. అరుదైన ఆఫర్లు అందుకొని తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఎంత మంది వచ్చినా గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది తెలుగు ఇండస్ట్రీ. ప్రతీ ఒక్కరిని అక్కున చేర్చుకొని మంచి అవకాశాలు ఇస్తోంది. దీంతో కొత్త భామలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మృణాళ్ ఠాకూర్.. మరాఠి, హిందీ చిత్రాలతో ఉత్తరాదిన మంచి పేరు సంపాదించుకుంది. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్ లతో నటించి క్రేజ్ కొట్టేసింది. ఇపుడు తెలుగు నాట అడుగు పెట్టిన ఈ భామ హనూ రాఘవపూడి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో వస్తోన్న మల్టీలింగ్వల్‌తో టాలీవుడ్ కు పరిచయమవుతోంది.

ఇక నజ్రియా ఫాహద్ అయితే తమిళ, మళయాళ చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది. మ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు.. తిరిగి తన సినీకెరీర్ స్టార్ట్ చేసింది. మళయాళీ సినిమాలతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకొని.. తాజాగా తెలుగునాట అడుగుపెడుతోంది. నేచురల్ నాని సరసన 'అంటే సుందరానికి' అనే చిత్రంలో నటిస్తోంది.

ఇక అఖిల్, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్ 'ఏజెంట్'. అఖిల్‌ మేకోవర్‌తోనే ఈ సినిమాపై బజ్‌ పెరిగిపోయింది. ముఖ్యంగా సిసింద్రీ సిక్స్‌ప్యాక్‌ స్టిల్స్‌కి స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీతో ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. సోషల్‌ మీడియాకి గ్లామర్‌ డోస్ పెంచే హాట్ మోడల్ సాక్షి వైద్య 'ఏజెంట్‌'తో జోడీ కడుతోంది.

టాప్‌ హీరోలకి హీరోయిన్లు ఈజీగానే సెట్‌ అవుతున్నారు. కానీ యంగ్‌స్టర్స్‌కి, మీడియం రేంజ్‌ హీరోలకి పెయిర్ దొరకడం కష్టమైపోతోంది. స్టార్ హీరోయిన్లు అయితే హీరో రేంజ్‌, సినిమా బడ్జెట్‌ని బట్టి కాల్షీట్స్‌ ఇస్తున్నారు. దీంతో కుర్రహీరోలంతా కొత్త హీరోయిన్లని తీసుకొస్తున్నారు. చూద్దాం.. ఈ బ్యూటీలు తెలుగునాట ఎలాంటి సక్సెస్ సాధిస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: