సంక్రాంతి తెలుగు సినిమా కు ఉన్న లింకు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో సంక్రాంతి పండుగ సినిమా లకు అతి పెద్ద పండుగ. సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ లో ఉన్నా సరే పోటీపడి మరి ఎవరికి వారు సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలుగులో సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో దిగుతున్నాయి. విచిత్రమేంటంటే అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. అయితే వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ చరిత్రలోనే ఏ సంక్రాంతికి జరగనంత పెద్ద యుద్ధం జరుగుతుంది.
ఇదే ఇప్పుడు తెలుగు సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే సంక్రాంతికి మూడు భారీ అంచనాలు ఉన్న సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. వచ్చే సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తోన్న‌ సినిమాల యూనిట్లు ఇప్పటికే అధికారికంగా రిలీజ్ డేట్లు ప్రకటించుకున్నారు. పవన్ క‌ళ్యాణ్ - రాణా కాంబినేషన్ లో తెలుగులో రీమేక్ అవుతున్న అయ్యప్ప కోషియ‌మ్‌ జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకుడు.

ఆ మరుసటి రోజు జనవరి 13న మహేష్ బాబు - ప‌రుశురాం కాంబినేషన్లో వస్తున్న స‌ర్కారువారి పాట‌ థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జనవరి 14న సాహో సినిమా తర్వాత మరోసారి భారీ గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్‌ రిలీజ్ అవుతోంది. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే మరో మూడు సినిమాలు సైతం సంక్రాంతి పై క‌న్నేసి ఉన్నాయి. ఏదేమైనా మూడు పెద్ద సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలో ఉండటంతో ఇక్క‌డ వార్ మామూలుగా ఉండేలా లేదు. మరి ఈ పెద్ద యుద్ధంలో ఎవరు ? పైచేయి సాధిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: