సినిమా హీరోల వారసులు యవ్వనంలోకి రాగానే ఇండస్ట్రీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో వారసుడు ఎంట్రీ ఇస్తే ఫుల్ కుషీ అవుతారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అఖురా నందన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అకిరా నందన్ ఇటీవల ఓ ఫంక్షన్లో కనిపించగా అతడి కటౌట్ చూసి అభిమానులు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. తమ హీరో పవన్ కళ్యాణ్ కొడుకు ఇండస్ట్రీని ఏలుతాడని ఫిక్స్ అయిపోయారు. దాంతో త్వరలో అఖిరా ఎంట్రీ ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఆఖిరా కూడా అందుకోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిరా ఎంట్రీ పై అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

కానీ రేణుదేశాయ్ మాత్రం ఇప్పుడే అఖీరా ఎంట్రీ ఉండదని చెప్పారు. కానీ ఆఖీరా మాత్రం హీరోకి కావలసిన అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. బుల్లి సూపర్ స్టార్ ఇటీవల తండ్రితో కలిసి మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ టీచర్ అఖిరా మరియు పవన్ కళ్యాణ్ తన వద్ద సంగీతం నేర్చుకుంటున్నారని ఫోటోలు షేర్ చేసింది. ఇక ప్రస్తుతం అకీరానందన్ కర్ర సాములో కూడా శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేసింది. దాంతో ఈ వీడియో అకీరానందన్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసమే అని అంతా భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చిన్న వయస్సు నుండే కరాటే నేర్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో అకీరానందన్ కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్నారు అని అభిమానులు చెబుతున్నారు. 

అంతేకాకుండా త్వరలోనే బుల్లి పవర్ స్టార్ ఎంట్రీ ఉండబోతుందని అనుకుంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి మేనల్లుల్లు, అల్లుడు  మరియు కుమారుడు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవలే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అకీరానందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఫస్ట్ సినిమాకు ఎలాంటి క్రేజ్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: