శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఏమో ఊహించుకుంటోంది. కానీ ఏదో జరిగిపోతోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు తమ హవా చూపించాలని ఆరాటపడుతోంది. కానీ పాపం ఏం చేద్దాం.. అందరూ ఆ బ్యూటీని అదోలా చూస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన ఐటమ్ పాపగా చూస్తున్నారు. ఇంకేముందీ జాక్వెలిన్ చాలా ఫీల్ అయిపోతోంది.

ప్రియాంక చోప్రాకు మ్యారేజ్ అయిపోయి అమెరికాలో జెండా పాతేయడంతో జాక్వెలిన్ లో ఆశలు పెరిగిపోయాయి. ఇక దీపిక పదుకొణే స్ట్రాంగ్‌ రోల్స్‌ అంటూ రెగ్యులర్‌ మూవీస్‌ని పక్కనపెట్టేయడంతో.. ఈ శ్రీలంకన్ బ్యూటీ ఊహలు ఎక్కడికో వెళ్లిపోయాయి. దీంతో అవకాశాలు అన్నీ తనకేనని భావించింది.  కానీ ఈ హీరోయిన్‌ ఆశలు ఆవిరైపోయాయి.  ఎంత ప్రయత్నం చేసినా టాప్ చైర్లో కూర్చోలేకపోతోంది. అయితే ఉత్తరాదిన హీరోయిన్‌ పాత్రలు అయినా వస్తున్నాయి గానీ, దక్షిణాదిన మాత్రం కేవలం ఐటం సాంగ్స్ కే తీసుకుంటున్నారు.
:
ఉత్తరాదికి వెళ్తున్న చాలా సౌత్‌ సినిమాల్లో బాలీవుడ్‌ భామలే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.  మార్కెట్‌ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఇలాగే కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే హీరోయిన్‌ రోల్స్ మాత్రం ఇవ్వడం లేదు. స్పెషల్ క్యారెక్టర్లు, సాంగ్స్‌ చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్, క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పీరియాడికల్ డ్రామా 'హరిహరవీరమల్లు'లో జాక్వెలిన్ సపోర్టింగ్ రోల్ చేస్తోంది. ఇక ఇంతకుముందు ప్రభాస్ 'సాహో' సినిమాలో బ్యాడ్‌ బాయ్ సాంగ్ చేసింది జాక్వెలిన్.

జాక్వెలిన్‌కి తెలుగులోనే కాదు కన్నడలో కూడా ఇలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అనే ట్యాగ్‌ఉన్నా, జాక్వెలిన్‌ని కన్నడ సినిమా వాళ్లు కూడా స్పెషల్‌ క్యారెక్టర్స్‌కే తీసుకుంటున్నారు. సుదీప్ హీరోగా 'విక్రాంత్ రానా' అనే సినిమా చేస్తున్నాడు. త్రీడీ ఫాంటసీ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈమూవీలో జాక్వెలిన్ ఎక్స్‌టెండెజ్‌ క్యామియో చేస్తోంది. దీంతో జాక్వెలిన్‌ని సౌత్‌లో ఎవరూ హీరోయిన్‌గా చూడటం లేదని కామెంట్ చేస్తున్నారు బాలీవుడ్‌ జనాలు. చూద్దాం సినీ జనాలు ఆమెను హీరోయిన్ గా ఎపుడు చూస్తారో.




మరింత సమాచారం తెలుసుకోండి: