ప్రతీ సినిమా ఏదో ఒక ఇంట్రెస్ట్ పాయింట్ మీదే నడుస్తూ ఉంటుంది స్టోరీ. ఇక సినిమాలో హీరో, హీరోయిన్లు సైతం వారి క్యారెక్టర్ లో ఎక్కువగా ఒకే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పదం మొత్తం సినిమా అంతా హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది. అలా మన హీరోయిన్లు వాడిని పదాలు ఏంటో తెలుసుకుందాం.

1). జెనీలియా -  బొమ్మరిల్లు:
ఈ సినిమాలో జెనీలియా కి ఎక్కువగా మార్కులు వచ్చాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా ఈమె వాడిన డైలాగ్ "అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ" వంటి డైలాగ్ ఎక్కువగా వినిపించింది. ఇక ఇది అప్పట్లో మొబైల్ రింగ్ టోన్ గా కూడా ఉపయోగించారు.

2). రకుల్ -వెంకటాద్రి ఎక్స్ ప్రెస్:
రకుల్ ఇప్పుడు ఎక్కువగా జిమ్ సెంటర్ లోనే ఉంటుంది. ఈమె తన అందం కోసం,  ఫిట్నెస్ కోసం ఎక్కువగా కష్ట పడుతూ ఉంటుంది. ఈమె నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా లో"ప్రార్థన, ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ" అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది.

3). రెజీనా-సుబ్రహ్మణ్యం ఫర్ సేల్:
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా. ఇక ఈ సినిమాలో "సీత ఇక్కడ. సీతతో అంత ఈజీ కాదు".  డైలాగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

4). సదా-జయం:
జయం సినిమాతో మంచి పేరు సంపాదించినది హీరోయిన్ సదా .  ఇక అంతే కాకుండా ఈమె ఈ సినిమాలో"వెళ్లవయ్యా వెళ్ళు వెళ్ళు.."అంటూ చెప్పే డైలాగ్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

5). కొత్త బంగారులోకం-శ్వేత బసు:
ఈ సినిమాతో బాగా పేరు సంపాదించింది శ్వేతాబసు.ఈ సినిమా బాగా యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈమె "ఎకడ.." అంటూ పలికే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది.

6). సాయి పల్లవి-ఫిదా:
తెలుగు అమ్మాయిల కనిపించే హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా సినిమాలో"భానుమతి.. ఒక్కటే పీస్..హైబ్రిడ్ పిల్ల"అనే డైలాగ్ కుర్రకారును మతి పోగొట్టింది అని చెప్పవచ్చు.

ఇక అంతే కాకుండా రష్మిక సరిలేరు నీకెవ్వరు, మెహరీన్-కృష్ణ గాడి వీర ప్రేమ కథ, అంజలి -సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..ఇక మరికొందరు హీరోయిన్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: