సినిమాల్లో ఎక్కువగా ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ అలా ప్రత్యేకత ఉండేవారు తక్కువగా ఉంటారు. ఇక అంతే కాకుండా వారు కూడా స్టార్ హీరోస్ కావడమనేది విశేషం. అయితే మన టాలీవుడ్ లో కొంత మంది హీరోలకు కొంచెం ఈ ప్రత్యేకత ఉందంట. అది ఏమిటంటే మన హీరోలకు సొంత విమానాలు కూడా ఉన్నాయట.అలా  ఎవరెవరికి  ఉన్నాయో..వాటి వివరాలు ఏమో చూద్దాం. మన హీరోలకు అత్యధిక ఖరీదైన ఇల్లు కూడా ఉన్నాయి, ఇక అంతే కాకుండా లగ్జరీ కార్లు కూడా సంపాదించుకున్నారు..

1). నాగార్జున:
టాలీవుడ్ లో మన్మధుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది మనకి నాగార్జున. ఈయన తమ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఫ్లైట్ లోనే వెళ్తారట. ఇక ఈయన  వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ సమయంలో కూడా తన  విమానాన్ని ఉపయోగించుకున్నారు.

2). అల్లు అర్జున్:
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యామిలీ కోసం ఒక సొంత విమానాన్ని తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో  నిహారిక తో కలిసి వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఉదయపూర్ కు ఇందులోని వెళ్లారట అంతా.

3). ఎన్టీఆర్:
ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో మనకు తెలుసు.. ఇక ఈయన 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక విమానాన్ని కొనుగోలు చేశారు. కేవ‌లం త‌న ఫ్యామిలీ ట్రిప్స్ కోస‌మే దీనిని వాడుతుంటారు.

4). చిరు ఫ్యామిలీ:
మెగాస్టార్ చిరంజీవి,  రామ్ చరణ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సొంత ఫ్లైట్ ను దాదాపుగా 100 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారట. గత సంవత్సరం జరిగిన నిహారిక వివాహానికి కొంతమంది ప్రత్యేక అతిథుల కోసం ఈ విమానాన్ని ఉపయోగించుకున్నారు.

వీరందరూ వీరు విమానాలను తమకు దగ్గరగా ఉండే ఎయిర్ పోర్ట్ స్టేషన్లలో వీటిని ఉంచుతారు. అక్కడ ఉండేటువంటి సిబ్బంది వీరి యొక్క విమానాలను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎయిర్ పోర్టు సంస్థతో ఒప్పందం చేయించుకొని అలా చేస్తుంటారని విషయం తెలుస్తోంది. ఇంకా అంతే కాకుండా ఎవరికైనా కావాల్సి వస్తే ఆ విమానాలను రెంటుకు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: