హీరోయిన్ అవ్వడం అంటే అంత ఆషామాషీ కాదు.. ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. అది కేవలం హీరోయిన్ గా చేసే వారికే తెలుసు. తన అందంతో, తన మాటలతో, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి హీరోయిన్. అలా తను ఎంతో రిస్క్ చేస్తే గానీ హీరోయిన్ అవ్వడం కష్టం. అయితే ఇప్పుడు హీరోయిన్ పూర్ణ .. తను హీరోయిన్ అవ్వడానికి కారణం ఆమె అని చెప్తోంది.ఇంతకూ ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లరి నరేష్ తో సీమటపాకాయ్ సినిమాలో  జోడీగా వచ్చిన హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈమె. ఇక ఈమె ప్రస్తుతం బుల్లితెరపై కూడా జడ్జిగా పలు చోట్ల కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొంచెం పూర్ణ ఓవరాక్షన్ చేయడంతో ఓ పక్క  నెటిజన్లు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా కళ్యాణ్ జి గుణం డైరెక్షన్లో " సుందరి" అనే టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటుడు "అంబటి అర్జున్" హీరోగా చేయడానికి సిద్ధమయ్యారు.

ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ భాగంలోనే హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. కొన్ని విషయాలను తెలియజేసింది. ఈ సినిమాకు ఒక పెద్ద హీరోయిన్ నైనా తీసుకోవచ్చు.. కానీ నిర్మాత రిజ్వాన్ మాత్రం నాపై నమ్మకం ఉంచి హీరోయిన్ గా నన్నే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాను చేసే అంత స్టార్ హీరోయిన్ ని తాను కాదంటూ తెలిపింది. ఇలాంటి సినిమాలలో నటించడానికి ముఖ్య కారణం నయనతార అని తెలియజేసింది పూర్ణ.

నయనతార సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్  అయి ఇలాంటి సినిమాలని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. అందుచేతనే ఈ చిత్రంలో నేను  నటించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాని చూసి ప్రేక్షకులంతా ఆదరించండి అంటూ తెలిపింది పూర్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: