సినీ ఇండస్ట్రీలో సాయికుమార్ అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది. ఈయన నటన పరంగా తనదైన శైలిలో సినిమాని ఒక రేంజ్ లో ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇక అంతే కాకుండా ఈయన డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ..అనేక సినిమాలలో స్టార్ హీరోలకు వాయిస్ డబ్బింగ్ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు సాయికుమార్ వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుందాం. సాయి కుమార్ తను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ల తండ్రి పి.జె.శర్మ చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. ఇక ఒకానొక సమయంలో తమ పిల్లలకు"స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవారు.ఇక సాయికుమార్ అక్క కేవలం స్కాలర్ షిప్ ద్వారా చదువుకుంది.

సాయికుమార్ ఎప్పుడూ పుస్తకాలను కొనే వారు కాదు. తమ సీనియర్స్ నుంచి పుస్త‌కాలు తెచ్చుకొని చదివేవాడు. ఇక మధ్యాహ్న సమయంలో  భోజనం వారికి"గోధుమ అన్నం" పెట్టేదట వారి అమ్మ. ఆ భోజనం తినలేక సాయికుమార్ సోదరి (చెల్లెలు) ఏడ్చేదట. అలాంటి సమయంలో కూడా వీరి తల్లి వీరందరినీ మంచి గా తీర్చి దిద్దింది. సాయి కుమార్ వాళ్ళ నాన్న రైల్వే ఉద్యోగి. ఈ ఉద్యోగాన్ని విజయనగరంలో చేసేవారు. అలా ఉద్యోగం చేసుకుంటున్న సమయంలోనే, సోమయాజులు ,  రమణ మూర్తి వంటి వారితో కలిసి నాటకాలలో స్టేజి మీద వేసేవారు. అలా తనకి నటన మీద  ఉన్న ఆసక్తితో,  1959 లో ఉద్యోగాన్ని వదిలేసి మద్రాసులో స్థిరపడ్డాడు.

కానీ సాయికుమార్ వాళ్ళ అమ్మ,వారి ఇంట్లోనే పిల్ల‌ల‌ను క‌నిపెట్టుకుని ఉండేద‌ట‌. సాయికుమార్ తల్లి పేరు కృష్ణ జ్యోతి, ఈమెది కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి లో ఉండేవారు. ఇక ఈమె తాతలు.. మైసూరు రాజుల దగ్గర సేవకులుగా పని చేసేవారు. ఈమె వివాహానికి ముందు పోలో అనే ఆటను ఆడేదట, కానీ తన భర్త కోసం అన్ని వదిలేసుకుని వచ్చింది. ఇక శర్మ ను మొదటిసారిగా రంగస్థలం మీద చూసిన కృష్ణ జ్యోతి , శర్మను ఇష్టపడింది. కానీ ఆమె ఆ విషయం శర్మకు చెప్పలేదు. ఇక ఆ తర్వాత కృష్ణ జ్యోతి ఒకసారి అనార్కలి వేషం వేసినప్పుడు కృష్ణ జ్యోతిని చూసి మంత్రముగ్ధులు అయ్యాడు శర్మ. ఇక అలా శ్రీకృష్ణదేవరాయలు నాటకంలో ఇద్దరూ కూడా నటించి,  అక్కడే పరిచయం చేసుకొని, ప్రేమలో పడ్డారు తర్వాత పెళ్లి చేసుకొని వీరికి ఐదుగురు సంతానం. వారిలో సాయి కుమార్ కూడా ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: