బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉంటూ అక్షయ్ కుమార్ వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతూ ఉన్నాడు. లాక్ డౌన్ వల్ల చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడం తో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. అన్ని సినిమాల లాగే ఆయన నటిస్తూన్న విడుదలకి సిద్ధం గా ఉన్న సినిమా లు పోస్ట్ పోన్ అయ్యాయి.  ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అందరూ తమ సినిమా లను విడుదల చేస్తున్న క్రమంలో అక్షయ్ కుమార్ ఇంత పోటీ అయ్యిందని మరొకసారి తన సినిమా నీ పోస్ట్ పోన్ చేయవలసి వచ్చింది. ఆ విధంగా ఇలా తన సినిమాను పోస్ట్ చేయడంతో అక్షయ్ ఎంత నష్టపోయారో ఇప్పుడు చూద్దాం. 

సంవత్సరానికి నాలుగేసి ఐదేసి సినిమాలు చేసే అక్షయ్ కుమార్ కరోనా దెబ్బతో కనీసం సగం సినిమాలు కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు. సెకండ్ తర్వాత ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్ కూడా మరొకసారి తన సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో కలకలం రేగుతుంది. అక్షయ్ కుమార్, హ్యుమా ఖురేషి, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బెల్ బాటమ్ సినిమా జూలై 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా విడుదల కాలేదు ఇప్పుడు ఈ సినిమా ఆగష్టు 19న విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ చిత్ర బృందం. 

అయితే లాక్ డౌన్ టైం లో బాలీవుడ్ లో ఎక్కువ నష్టపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమార్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తే ఆయన 30 కోట్లకు పైగానే ఒక్కో సినిమా కి రెమ్యునరేషన్ తీసుకుంటారు. సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవారు కాబట్టి ఈ లెక్కన సంవత్సరానికి 120 నుంచి 150 కోట్ల దాకా పుచ్చుకునే వారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఒక్కసారిగా సినిమా లు తగ్గిపోవడంతో దాదాపు 200 కోట్ల రూపాయల నష్టాన్ని ఈ రెండు సంవత్సరాలలో చవి చూశారట. బాలీవుడ్ భారీ మల్టీ స్టారర్ సినిమా గా వస్తున్న  సూర్యవంశీ సినిమా విడుదల ఇంకా సందిగ్దంలో నే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: