గుజరాతీ అందాల బొమ్మ మోనాల్ గజ్జర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా పాపులర్ కాలేకపోయింది. కానీ తెలుగు రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 4 లో నటించడం వల్ల వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 కి గ్లామర్ ప్లస్ గా నిలిచి కుర్ర కారును ఆకట్టుకుంది. ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస ఆఫర్లతో బిజీగా మారిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే మా టీవీలో డాన్స్ ప్లస్ షో లో ఒక జడ్జీగా కనిపించి అలరించింది. షో అయిపోగానే మెరుపు తీగలా మాయమైపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో సందడి చేస్తుంది. కాని స్క్రీన్ పై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మరో వైపు మోనాల్ మిస్సింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మోనాల్ మాత్రం సైలెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో నటించేస్తుంది అంటూ సినీ సర్కిల్స్ లో వినికిడి. సీనియర్ హీరో రవితేజ ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ అనే ట్యాగ్ లైన్ తో నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. శరత్ మండవ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో 'మజిలీ' ఫేమ్  'దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ సెట్ లో ఈమె కనిపించినట్లు కొందరు అంటున్నారు.  

దానితో ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మోనాల్ గజ్జర్ నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే ఫ్యాన్స్ కి ఇంకా ఈ విషయం బయటకు రాలేదని సమాచారం. ప్రస్తుతానికి ఇది ఒక అందమైన గాసిప్ గానే ఉంది. ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమే అయితే మోనాల్ కెరియర్ కి ఇక అఢ్ఢే  లేదంటున్నారు ఫ్యాన్స్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: