సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు..? ఎవరికీ..? ఎలా..? అవకాశం తలుపు తడుతుందో చెప్పడం చాలా కష్టం.. ఒకవేళ అలా అవకాశం వచ్చినప్పుడు దానిని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే సినీ ఇండస్ట్రీలో మంచి స్థాయిని చేరుకోవడానికి వీలు ఉంటుంది. ఇకపోతే కొంతమంది సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా అడుగు పెట్టి , అతి తక్కువ సమయంలోనే మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో వడ్డే నవీన్ కూడా ఒకరు..ఈయన సైలెంట్ గా ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తర్వాత నుంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇక వడ్డే నవీన్ ఎవరో కాదు ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వడ్డే రమేష్ తనయుడు. 1997వ సంవత్సరంలో కోరుకున్న ప్రియుడు అనే  సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక తర్వాత పెళ్లి సినిమాతో పాపులర్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత "మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది"  సినిమాలో శ్రీకాంత్ సరసన మరో హీరోగా నటించి అక్కడ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నవీన్. ఇక ఇందులో లయ, రాశి ప్రముఖ పాత్రల్లో నటించి,  ఈ సినిమాను హైలెట్ చేశారు.

అప్పటివరకు మంచి ఫామ్లో ఉన్న వడ్డే నవీన్,  ఏమైందో తెలియదు కానీ తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపుగా డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఆ తర్వాత తను పెళ్లి చేసుకున్న అమ్మాయి నుంచి కూడా విడాకులు తీసుకోవడంతో,  చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తర్వాత  బిజినెస్ వైపు అడుగులు వేసిన వడ్డే నవీన్,  తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఎటాక్ అనే సినిమా ద్వారా స్టార్ట్ చేసాడు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక త్వరలోనే మరొకసారి సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు వడ్డే నవీన్.


మరింత సమాచారం తెలుసుకోండి: