బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కి యూత్ లో బోలెడంత క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన సినిమాలు కూడా బాలీవుడ్ లో మంచి విజయాలు సాధించడంతో నటిగా కూడా ఈ హాట్ బ్యూటీ కి క్రేజ్ ఎక్కువే అని చెప్పవచ్చు. అయితే ప్రతి పెళ్లీడుకొచ్చిన అమ్మాయికి తాను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలి. తన పెళ్లి ఎక్కడ జరగాలి...ఎలా జరగాలి...అని ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిని కొందరు మనసులోనే దాచుకుంటే మరికొందరు మాత్రం బయటకు చెబుతూ ఉంటారు. 

ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన జాన్వికపూర్ ఒక  ఇంగ్లీష్ మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎలా జరగాలి అనే దాని గురించి కొన్ని విషయాలు చెప్పింది.
బ్యాచిలర్ పార్టీ ఎక్కడ చేసుకుంటారు..?
జాన్వీ కపూర్ :దక్షిణ ఇటలీలోని కాప్రీలో పడవలో చేసుకుంటాను.

మరి..మెహందీ, సంగీత వేడుకలు..?
రెండు వేడుకలను మైలాపూర్‌ (తమిళనాడులోని శ్రీదేవి ఇల్లు)లో మా ఇంట్లో జరుపుతాం.

మరి..పెళ్లి ఎక్కడ చేసుకుంటారు..?
తిరుపతిలో..

పెళ్లికి ధరించే బట్టల గురించి..? ఎలాంటి కలర్స్ వాడతారు..?
సంప్రదాయబద్ధంగా ఉండేటట్లు ప్లాన్ చేస్తాను.. పెళ్లికి కాంచీపురం చీర.. మెహందీ, సంగీత్ లోకి ఎల్లో, పింక్, గోల్డ్‌ కలర్‌... వీటితో నా అవుట్‌ఫిట్స్‌ ఉంటాయి...

మరి నగలు..?
డైమండ్ తో చేసేది వాడతాను..

పెళ్లి వేడుకలను ఎన్ని రోజులు జరుపుకుంటారు..?
రెండు రోజులు అంతే...

రిసెప్షన్ ఎక్కడ..?
రిసెప్షనా..? అవసరమా..?

పెళ్లిలో మీ రియాక్షన్ ఎలా ఉంటాయి..?
ఎగరడం..నవ్వడం.. తినడం.. ఏడవడం..ఇలా........

పెళ్లి మండపం ఎలా ఉండాలి అనుకుంటున్నారు..?
డెకరేషన్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు.. కాకపోతే ట్రెడిషనల్ గా ఉండాలి అనుకుంటున్నాను.. పెళ్లి స్టేజి ని మల్లె పువ్వులు మరియు కొవ్వొత్తులతో అలంకరిస్తే బాగుంటుంది.

ఎటువంటి వ్యక్తి భర్తగా రావాలని కొంటున్నారు..? ఎవరైనా ఉన్నారా..?
ఖచ్చితంగా చాలా తెలివైనవాడు అయ్యి ఉండాలి.. నేను ఇంకా ఎవరినీ కలవలేదు..
ఇలా జాన్వికపూర్ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: