అల్లు అర్జున్ సుకుమార్ కాంబో క్రేజీ పాన్ ఇండియా మూవీ పుష్ప డిసెంబర్ చివరన క్రిస్ మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ఊర మాస్ రోల్ తో అలరించనున్నారు. పుష్ప కోసం డిఎస్పీ అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ అందిస్తున్నాడని చెబుతున్నారు. ఇక పుష్ప రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. క్రిస్ మస్ రేసులో పుష్ప రాజ్ దిగుతున్నాడు. ఇక ఎటొచ్చి మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేయాల్సి ఉన్నాయి.

అసలైతే డిసెంబర్ క్రిస్ మస్ రేసులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి కాంబినేషన్ లో క్రేజీ స్టోరీ బాక్సింగ్ నేపథ్యంతో ఈ మూవీ వస్తుంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా దుమ్ముదులిపేస్తాడని అంటున్నారు. మూవీలో వరుణ్ తేజ్ తో బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ రిలీజ్ ను క్రిస్ మస్ ప్లాన్ చేయగా ఇప్పుడు ఆ డేట్ కు అల్లు అర్జున్ పుష్ప వస్తుంది. ఈ క్రమంలో బన్నీ సినిమాకు పోటీగా వరుణ్ తేజ్ రావడం కష్టం కాబట్టి గని రిలీజ్ కన్ ఫ్యూజన్ లో పడినట్టు తెలుస్తుంది.

అయితే వరుణ్ తేజ్ గని సంక్రాంతి రేసులో పాల్గొనే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే పవన్, రానా ఏకే రీమేక్.. మహేష్ సర్కారు వారి పాట.. ప్రభాస్ రాధే శ్యాం 3 సినిమాకు పొంగల్ వార్ కు సిద్ధమయ్యాయి. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఈ పోరులో దిగుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ గని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అనుకున్నా సరైన రిలీజ్ డేట్ కోసం చిత్రయూనిట్ వేచి చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: