ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోనాల్ గజ్జర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది మోనాల్ గజ్జర్. తన అందం అభినయంతో అప్పట్లో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఇక ఈ అమ్మడు నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగయ్యింది. కానీ ఆ తర్వాత నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ప్రత్యక్షం అయ్యింది. దీంతో సినిమాల కంటే బిగ్బాస్ ద్వారానే మరింత గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.



 ముఖ్యంగా బిగ్బాస్ లో అఖిల్ సార్దక్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా అటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. తన అందంతో  బిగ్ బాస్ హౌస్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్బాస్లో ఎంతగానో క్రేజ్ పొందిన మోనాల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు  ఇప్పటికే స్టార్ మా లో ఒక షో కి పోస్టింగ్ చేసింది. అదే సమయంలో వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇక ఒక షోలో జడ్జిగా కూడా ప్రత్యక్షం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.  అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం దక్కడం లేదు.



 అయితే ఇటీవలే ఏకంగా ఒక స్టార్ హీరో సినిమాలో మోనాల్ గజ్జర్ ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్ కోడైకూస్తోంది. బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున సినిమా లోనే మోనాల్ గజ్జర్ ఛాన్స్ కొట్టేసిందట. ప్రస్తుతం నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు మోనాల్ గజ్జర్ ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసేందుకు అటు మోనాల్ గజ్జర్ కూడా ఓకే చెప్పిందట. కాగా ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై నాగార్జున అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: