జీవితంలో బండ్లు ఓడలవడం, ఓడలు బండ్లవడం చాలా సహజం. అందుకే జీవితం గురించి తెలిసిన వారు ఎప్పుడూ కష్టాలకు కుంగిపోకూడదు, సంతోషాలకు పొంగిపోకూడదని చెబుతారు. కానీ ప్రపంచంలో చాలా మంది మాత్రం కాసింత స్టేటస్ సింబల్ రాగానే తమను మించిన వారు లేరు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. తమకు మరెవరూ సాటిరారని రేంజ్ లో రెచ్చిపోతారు. అలా చేసి చేసి చివరికి బొక్క బోర్లా పడి నవ్వుల పాలవుతారు.

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. మిస్ వరల్డ్ గా ఎంపికైంది తనకేంటి అని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం తన పరిస్థితి ఏ మాత్రం బాగో లేదని ఈ అమ్మడు వాపోతుంది. ఎంతలా అందాల ఆరబోత ప్రదర్శిస్తూ... హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా ఏ ఒక్క నిర్మాత సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం లేదని తెగ బెంగ పడుతుందట.  మానుషీ మోడలింగ్ రంగంలో నిలదొక్కుకోని 2017లో మిస్ వరల్డ్ గా ఎంపికైంది. ఈ విశ్వ సుందరి గురించి చాలా రోజుల పాటు గూగుల్ లో అనేక మంది వెతికారు. కానీ కరోనా వల్ల ఒక్కసారిగా తన జీవితం తలకిందులయిపోయిందని ఈ అమ్మడు రంది పడుతోందట. విశ్వ సుందరి కిరీటం గెలిచిన తర్వాత అమ్మడు సినిమాల్లో రాణించడం పక్కా అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్లుగానే పృథ్వీరాజ్ బయోపిక్ లో అక్షయ్ కుమార్ సరసన ఈ అమ్మడు హీరోయిన్గా సెలక్ట్ అయింది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలవుకుండానే వాయిదా పడింది. దీంతో అమ్మడు జీవితం మొత్తం తలకిందులయిందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం క్యాలెండర్లకు మోడల్ గా నటిస్తోంది. అంతే కాకుండా తన హాట్, హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మతులు చెడగొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: