బలవంతంగా పోర్న్ సినిమాలు తీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి గేహన వశిష్ఠ బెయిల్ దరఖాస్తు చేసుకుంది. అయితే తాజాగా ఆమెకు ఈ పిటిషన్ విషయంలో కోర్టు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు. జ్యువెల్ గా పిలవబడుతున్న గెహన అశ్లీలత, అసభ్యకరమైన సినిమాలు చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా గెహనా విశిష్ఠకు ముంబై సెషన్స్ కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు. అరెస్టు భయంతో గెహనా కోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి ఈ కేసులో గెహ్నాకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఇప్పుడు గెహనా కేసు తదుపరి విచారణ ఆగస్టు 6న అంటే వచ్చే శుక్రవారం జరుగుతుంది.

వాస్తవానికి కొన్ని కొత్త సాక్ష్యాల ఆధారంగా పోలీసులు గేహన వశిష్ఠతో సహా మరికొంత మందిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జ్యువెల్ వశిష్ఠను రాజ్ కుంద్రా ముందు కూర్చోబెట్టి విచారించాల్సి ఉంది. దీని కోసం పోలీసులు గెహ్నాను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే గెహన మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంది. తాను సిటీలో లేనని, అందుకే విచారణకు హాజరు కాలేనని సాకు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రశ్నించే నెపంతో పోలీసులు ఆమెను మరోసారి కస్టడీలోకి తీసుకోవచ్చుననే భయంతో గెహన కోర్టులో మధ్యంతర బెయిల్ దరఖాస్తును దాఖలు చేసింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గెహన కొత్త మోడళ్లతో బలవంతంగా అశ్లీల చిత్రాలను రూపొందించిందని, అత్యాచారం ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. దీని తర్వాత గెహనాను అరెస్టు చేసి జైలుకు పంపారు. 4 నెలలు జైలులో ఉన్న తరువాత గెహన 2 కేసులలో కోర్టు నుండి బెయిల్ పొందింది. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రమేయం విషయం తెరపైకి వచ్చిన తర్వాత రాజ్ కుంద్రా కోసం అశ్లీల కంటెంట్ అందించే "హాట్‌షాట్స్", "బొల్లిఫెమ్" అనే యాప్ కోసం కూడా గెహానా వీడియోలు తయారు చేసేదని వెల్లడైంది. కాగా ఇటీవల  జ్యువెల్ పోలీసులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తన అరెస్టును ఆపడానికి పోలీసులు తన నుండి 15 లక్షలు డిమాండ్ చేశారని ఆమె చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: