చిరంజీవి తన కెరీర్ లో ఒక ఏడాది పాటు సినిమాలు చేయకుండా అలా ఆగిపోయారు. అప్పట్లో అనుకున్న సినిమాలు కొన్ని సక్సెస్ కాకపోవడంతో ఆయన ఏడాది పాటు రెస్ట్ ఇచ్చేశారు. ఆ తరువాత వచ్చిన సినిమా హిట్లర్.

మూవీ 1997 జనవరి 4న విడుదల అయి సూపర్ డూపర్ హిట్ అయింది. చిరంజీవిలోని మరో కోణాన్ని ఈ మూవీ ఆవిష్కరించింది. ఈ మూవీ మళయాళం రీమేక్. అక్కడ ముమ్ముట్టి ఇదే టైటిల్ తో హీరోగా చేసి హిట్ కొట్టారు. దాని రైట్స్ ని ఎడిటర్ మోహన్ తీసుకుని తెలుగులో ఎవరితో తీయాలి అని ఆలోచిస్తున్నపుడు మొదటిగా వచ్చిన పేరు హీరో మోహన్ బాబు.

ఈ విషయం మీద రచయిత మరుధూరి రాజాతో సిట్టింగ్ వేసిన ఎడిటర్ మోహన్ మోహన్ బాబు అయితే ఈ మూవీ బాగుంటుంది అని అనుకున్నారుట. ఇక ఈవీవీ సత్యనారాయణ ఈ మూవీని డైరెక్ట్ చేయాలని కూడా అనుకున్నరుట. అయితే మరుధూరి రాజా ఈ విషయం మీద ఈవీవీని అడగడం ఆయన నో చెప్పడం జరిగిపోయిందట. ఆ తరువాత ఈ సినిమా చిత్రంగా చిరంజీవి వద్దకు వెళ్ళింది.

ఆయన సరైన కధతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న టైమ్ లో మంచి స్క్రిప్ట్ తో  ఈ మూవీ ఉండడంతో ఎస్ అనేశారుట. అలా ఈ మూవీ మొదలైందట. ఈ మూవీకి ముత్యాలసుబ్బయ్య డైరెక్టర్. ఆయన ఫ్యామిలీ మూవీస్ తీయడంతో దిట్ట. ఇక మిగిలిన తారాగణం అంతా కూడా సెట్ కావడంతో 1996  మధ్యలో స్టార్ట్ చేసి 1997 సంక్రాంతి బరిలోకి దించారు. ఇక హిట్లర్ కలెక్షన్ల  మోత మోగించింది. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు ఆ ఇయర్ సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో నంబర్ వన్ మూవీగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: