తెలుగు సినిమా పరిశ్రమకు ప్రకాష్ రాజ్ ఎన్నో పాత్రల ద్వారా సుపరిచితుడే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా హీరోగా అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ప్రకాష్ రాజ్. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో సైతం ఆయన నటించి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఈయన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద నటుడు అయ్యాడు అంటే ఆయన ప్రయాణం అసామాన్యమైనది అని చెప్పవచ్చు.

ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి సోదరి లలితకుమారి ని వివాహం చేసుకోగా అభిప్రాయ భేదాల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ కు చెందిన నృత్య కళాకారిణి ని 2010లో రెండవ వివాహం చేసుకున్నాడు. ఉత్తమ ప్రతినాయకుడిగా గంగోత్రి సినిమాకు నంది పురస్కారాన్ని అందుకున్న ప్రకాష్ రాజ్ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నాడు. ఠాగూర్, వర్షం, భద్ర, పోకిరి, అతడు, బొమ్మరిల్లు, చిరుత, ఖలేజా, బృందావనం, ఇంద్ర, అంతపురం, నువ్వు నాకు నచ్చావ్, సుస్వాగతం, చూడాలని ఉంది వంటి చిత్రాలు గొప్ప పేరును తీసుకువచ్చాయి.

పోకిరి సినిమాలో ఆయన నటన అద్భుతం అని చెప్పవచ్చు. ఆ చిత్రంలో ఆయన చేసిన పాత్రకు గొప్ప పేరు వచ్చింది. ఆయన చెప్పిన గిల్లితే గిల్లిచ్చుకోవాలి అనే డైలాగు ఎంతో ఫేమస్. ఎన్నో సినిమాలలో ఆయన విలన్ గా నటించి విలన్ అంటే ఇలానే ఉండాలి అనిపించేలా తన నటనతో అందరిని అలగించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన ఎన్నో గొప్ప పాత్రలలో నటించాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో అన్ని భాషలలో బిజీగా ఉండే నటుడు. ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఇంతవరకు తెలుగు సినిమా పరిశ్రమలోకి మళ్లీ రాలేదనే చెప్పాలి. అందుకే ఆయనకు సంవత్సరానికి 10 సినిమాల కంటే ఎక్కువగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తు ఉంటాడు. మరి ప్రకాష్ రాజ్ భవిష్యత్ లో ఇంకా ఎలాంటి పాత్రలలో చూస్తామో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: