తార‌క్ షో అంటే ఏదో ఒక ప్ర‌త్యేకత ఉంటుంది. వెలుగుల రాముడు న‌వ్వులే ఓ ప్ర‌త్యేకం అని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. వాటికి తోడు ఆ యన ఈజ్, బాడీ లాంగ్వేజ్  ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు. సామా న్యుడితో మాట్లాడే విధానం ఒక్క‌టే కా దు త‌న అభిమానులు ఎవ్వ‌రైనా షోలో పాల్గొంటే వారిని రిసీవ్ చేసుకునే ప‌ద్ధ‌తి, వారి బాధ‌లు తెలుసుకునే తీరు ఇవ‌న్నీ తార‌క్ పై తెలుగు వారికి ఉన్న ప్రేమ‌, అభిమానాల‌ను పెం చుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే....
ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు పేరిట ప్ర‌తి రాత్రి ఎనిమిద‌న్న‌ర‌కు స‌న్ నెట్ వ‌ర్క్ లో సంద‌డి చేస్తున్నాడు తార‌క్. సామాన్యుల‌తో మా ట్లాడుతూ, వారి జీవితం గురించి తెలుసుకుంటూ, వారి క‌ష్టం సుఖం పంచుకుంటూ తార‌క్ అద్భుతంగా యాంక‌రింగ్ చేస్తున్నాడు. త‌న‌దైన న‌ట విశ్వ‌రూపంతో పెద్ద తెర‌పై హావ‌భావాలు ఒలికించే తార‌క్ , బుల్లి తెర‌ను కూడా అబాల గోపాలంను అల‌రిస్తున్నాడు. ముఖ్యంగా తారక్ ప్ర‌శ్న‌లు అడిగే విధానం, వారి వ్య‌క్తిగ‌త జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తూ మాట్లాడ‌డం ఇవ‌న్నీ ఆయ‌న‌కు అద‌న‌పు బ‌లం. న‌వ్వుతూ, న‌వ్విస్తూ, ఎమోష‌న‌ల్ అవుతూ ఆయ‌న సాగిస్తున్న ఈ ప్ర‌యాణం మంచి స్పంద‌న‌కు కార‌ణం అవుతోంది. తొలి రోజు చ‌ర‌ణ్ ను తీసుకు వ‌చ్చి లాంఛింగ్ ప‌రేడ్ ను ప్రారంభించిన ఆయ‌న, ఆ రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌దైన హ‌వాతో దూసు కుపోతున్నారు. తార‌క్ - చ‌ర‌ణ్ కాంబోలో వ‌స్తున్న ఆర్ ఆర్ ఆర్ విశేషాలే ప్ర‌ధాన బ‌లం ఈ షో కు. అంతేకాకుండా చెర్రీ వ్య‌క్తిగ‌త విష యాలు, కెరియ‌ర్ అన్నీ చెప్పించారు. అంతేకాదు బాబాయ్ ప‌వ‌న్ కు సంబంధించి విష‌యాలు అడిగి ఇంకాస్త ఆస‌క్తి పెంచేశారు.

దీంతో తార‌క్ షో ఆరంభ‌మే అదుర్స్ అయింది. అటుపై చాలా మంది సామాన్యుల‌ను క‌లిశారు ఆయ‌న‌. వీల్ ఛైర్ లో వ‌చ్చిన పార్టిసి పెంట్ ను తానే స్వ‌యంగా ఆ చ‌క్రాల కుర్చీని న‌డుపుకుంటూ వ‌చ్చి హాట్ సీట్ పై కూర్చోబెట్టారు. ప్ర‌శ్న‌లు అడిగి, కొన్ని వివ‌రాలు రా బ‌ట్టి, ఆమెకు కొత్త  స్ఫూర్తిని అందించారు. తార‌క రాముడి న‌వ్వుల‌తో ఈ షో మ‌రింత‌గా వెలుగులు చిందుతోంది. మొద‌టి వా రం కన్నా ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ కూడా బాగా పెరిగిపోయింది. మొద‌టి వారం టీఆర్పీ (యావ‌రేజ్) - 5.6 ఉండ‌గా, రెండోవారం 6.48, మూడో వారం 7.30గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: