తమిళంలో టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ సినిమా అంటే అక్కడ అభిమానులకి పండగనే అని చెప్పాలి.దానికి తోడు ఆయన చివరి సినిమా విశ్వాసం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో త్వరలో వచ్చే వాలిమై సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వరసగా డైరెక్టర్ శివతో వరసగా సినిమాలు తీసిన అజిత్ ఇప్పుడు వినోత్ దర్శకత్వంలో ఈ వాలిమై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటకి ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే అజిత్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో హల్ చల్ చేశారు.కానీ ప్రస్తుతం అజిత్ ఫాన్స్ ని ఈ సినిమా నిర్మాత అయిన భోని కపూర్ మీద చాలా కోపంగా ఉన్నారు.

ఎందుకంటే ఈ సినిమా టీజర్ ని ఇప్పటిదకా విడుదల చేయకపోగా అసలు అప్డేట్ కూడా ఇవ్వట్లేదు అని కోపంతో సోషల్ మీడియా లో వాలిమై పేరుతో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత ట్రెండ్ చేస్తున్న కూడా నిర్మాత నుంచి ఎలాంటి వార్తలు రావట్లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే లండన్ లో పూర్తి చేసుకుంది. తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా ని విడుదల చేయాలి అని మూవీ టీం భావిస్తున్నారు. వాలిమై లో ఇంకొక విశేషం ఏంటి అంటే ఇందులో విలన్ మన తెలుగు ఆర్ ఎక్స్ 100 హీరో కార్తిక్ నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటి హుమా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది.

ఈ  సినిమాలో బైక్ రేసింగ్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి అని టాక్. ఇక ఫాన్స్ బాధని అర్థం చేసుకొని త్వరలోనే టీజర్ ని నిర్మాతలు విడుదల చేస్తారో లేదో వేచి చూడాలి. ఈ సినిమా డైరెక్టర్ వినోత్ తీసింది మూడు సినిమాలే అయినప్పటికీ తమిళంలో మంచి పేరున్న డైరెక్టర్. ఆయన ఇప్పుడు అజిత్ ఎలా చూపిస్తాడో అని అభిమానులు అంత ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: