సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మదురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. సంగీతంలో తిరుగులేని మహారాణిగా రాణించిన ఆమె కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారం, రామన్ మెగసెసే పురస్కారాలు పొందిన మొట్ట మొదటి సంగీత కళాకారిణి. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకుందాం.

1936 లో సుబ్బలక్ష్మి స్వాతంత్య్ర సమరయోధుడు సదాశివంని కలిశారు. సదాశివం అప్పటికే వివాహం చేసుకున్నాడు. సదాశివం తన మొదటి భార్య మరణం తరువాత 1940 లో సుబ్బలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. సుబ్బలక్ష్మి కెరీర్‌ లో సదాశివంకి ముఖ్యమైన పాత్ర ఉందని అంటారు. అయితే ఆమె పెళ్లి వెనుక పెద్ద కథే ఉందట.

అప్పట్లో సుబ్బలక్ష్మి కి పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదట. దాంతో ఆమె ఇంట్లో నుంచి పారిపోయిందట. ఇంటి నుంచి మద్రాసు వెళ్లే రైల్లో ప్రయాణం చేసి తనకు నమ్మకస్తులైన స్నేహితుల వద్దకు వెళ్లిందట. ముందుగా ఆమె రైల్వే స్టేషన్ నుండి టి నగర్‌ లో ఉన్న ఖద్దర్ ఇంటికి గుర్రపు బండిపై వెళ్లిందట. ఆయన గతంలో ఆమె కోసం కొన్ని కచేరీ లను ఏర్పాటు సహాయం చేసాడు. ఆమె తన గేట్ ముందు ఉన్న జట్కా నుండి కిందకు దిగడాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడట. తనకు మళ్ళీ తన తల్లి దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదని సుబ్బలక్ష్మి చెప్పిందట. అయితే ఆమె అకస్మాత్తుగా రావడంతో ఆయన ఇబ్బంది పడ్డాడు. తన భార్య కు ఆమె గురించి ఏం చెప్పాలో అర్థం కాక సుబ్బలక్ష్మి ని సదాశివం ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత వారి ప్రయాణంలో ఇద్దరూ ఇష్ట పడి పెళ్ళి చేసుకున్నారు. సదాశివంకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ సుబ్బలక్ష్మి ఆయనను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: