ప్రస్తుతం నాని కెరీర్ కి ఒక పెద్ద హిట్ కావాలి . 2017 లో వచ్చిన యమ్ సి ఏ సినిమా తర్వాత ఇప్పటిదకా అంత పెద్ద హిట్ రాలేదు. మధ్యలో జెర్సీ లాంటి మంచి సినిమా వచ్చినప్పటికీ అది అంత పెద్దగా కలెక్షన్స్ తెచ్చుకోలేదు. ఇక  గత ఏడాది వచ్చిన వి సినిమా ఈ ఏడాది వచ్చిన టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల చాలమంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల్లో పడకుండా ఉన్నారు.

అయితే ఇలానే తన కెరీర్ ని నడిపించలేం అని నాని అర్థం అయ్యేనట్టే ఉంది. మిగతా హీరోలు అంత బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోతుంటే నాని మాత్రం ఇలా ప్లాప్స్ లో ఉండిపోవడం ఆయన ఫాన్స్ కి అసలు నచట్లేదు. అయితే నాని కి మాత్రం ఆయన చేయబోయే శ్యామ్ సింగరాయ్ సినిమా మీద చాలా నమ్మకం ఉందట. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బెంచ్ మార్క్ అవుతుంది అని నాని ఈ మద్య ఇంటర్వ్యూలలో చెప్పారు.

 ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ కి వచ్చింది. తెలుగు ఇలాంటి కొత్త కథ రాలేదట. టాక్సీ డ్రైవర్ సినిమా దర్శకుడు రాహుల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. క్రితి శెట్టి , సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా లో నాని లుక్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఈ సినిమానే కాకుండా బ్రోచేవారుఎవరురా సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో అంటే సుందరనికి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో విశేషం ఏంటి అంటే మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన మలయాళం నటి నజిరియా నజిమ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మీద కూడా నాని మంచి అంచనాలు పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: