మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా తనను తాను ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. సినిమా ఫలితం తేడా వచ్చినా కూడా నటుడుగా మాత్రం ఫెయిల్ కాలేదు. అంతేకాదు ఆయన వివాదాలకు పెద్దగా పోకుండా తన పని తాను చేసుకుపోయే నైజం కల వ్యక్తి. అలాంటి చెర్రీ ఎవరిని కూడా పల్లెత్తు మాట కూడా అనకుండా సినిమాలు చేసుకుంటూ పోయే వ్యక్తిత్వం కల వ్యక్తి. అలా ప్రేక్షకులు ఎంతగానో తనను అభిమానించేలా చేసుకుంటున్నాడు. అయితే రామ్ చరణ్ ఇటీవలే కాలంలో చేసిన కొన్ని  కామెంట్లు చేశాడు. తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు నీ విమర్శిస్తూ ఆయన ఈ మాటలు అనడం గమనార్హం.

మెగా పవర్ స్టార్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రం వినయ విధేయ ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు పెట్టుకోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలిసారి రామ్ చరణ్ నటిస్తున్న సినిమా రావడంతో మరిన్ని భారీ అంచనాలు పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే షూటింగ్ టైంలో ఈ చిత్రం చాలా బాగా వస్తుందని ప్రేక్షకులకు చిత్ర బృందం తెలిపింది. అలాగే ఈ సినిమా లో కాస్ట్ అండ్ క్రూ యు కూడా ప్రేక్షకులను అబ్బుర పరిచే విధంగా ఉండడంతో ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అన్నారు కానీ సినిమా విడుదలైన తరువాత కానీ దీని సంగతి తెలియలేదు.

విడుదలైన మొదటి రోజు మొదటి షో నుంచే ఈ సినిమాపై ఫ్లాప్ టాక్ ఏర్పడింది. రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ లో పర్వాలేదనిపించినా సినిమా కాదని ఒక పెద్ద మైనస్ గా తేల్చేశారు ప్రేక్షకులు దాంతో దర్శకుడు బోయపాటి శ్రీను పై కూడా విమర్శలు వచ్చాయి రామ్చరణ్ కూడా భారీగా డిసప్పాయింట్ అవ్వడంతో ఈ సినిమా ఆయన ఖాతాలో మరో భారీ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది ఈ నేపథ్యంలోనే ఆయన దీనిపై ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి బుద్ధి ఉంటే ఇంకోసారి ఆయనతో మళ్ళీ సినిమాలు చేయను అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను మళ్లీ కాల్బ్యాక్ చేసి ఈ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: