ఓ పెద్ద గొడవ కంగన రనౌత్‌కి బాగా ప్లస్ పాయింట్ అయింది. విమర్శలు.. వివాదాలు.. క్లారిఫికేషన్లు.. ఇటీవల బాలీవుడ్‌లో వెలుగు చూశాయి.  అనౌన్స్‌మెంట్‌కే ఇన్ని విమర్శలు అంటే సినిమాని విడుదల చేయనిస్తారా లేదా..? డబ్బులు పెట్టి భయం కొనుక్కోవడం ఎందుకు, సేఫ్‌గా వెళ్దాం అనుకున్నారో ఏమో కంగనా రనౌత్ కాల్షీట్స్‌ కొనుక్కున్నారు.

అలౌకిక్‌ దేశాయ్ దర్శకత్వంలో 'సీత' సినిమా వస్తుందనే ప్రకటన రావడం ఆలస్యం టైటిల్ రోల్ ఎవరు చేస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో స్టార్ట్ అయిపోయింది.  ఆ సాద్వీమణి పాత్రని ఎవరు పోషిస్తారు అని ఇండస్ట్రీ జనాలు కూడా చర్చించుకుంటోన్న సమయంలో  కరీనా కపూర్ పేరు వినిపించింది. ఈ సినిమా కోసం బెబో 12 కోట్లు అడిగిందనే టాక్ కూడా వచ్చింది. ఈ న్యూస్ బయటకు రావడం ఆలస్యం సోషల్‌ మీడియాలో పెద్ద గొడవే జరిగింది.

కరీనా కపూర్‌ ముస్లిం హీరో సైఫ్ అలీఖాన్‌ని పెళ్లి చేసుకుంది. అలాంటి హీరోయిన్‌కి 12 కోట్లు ఇచ్చి 'సీత' సినిమా తీయడం  ఏంటని ట్రోల్ చేశారు నెటిజన్లు. ఇక ఈ గొడవతో కరీనాని తీసుకోవడం లేదనీ.. సరైన హీరోయిన్‌ కోసం వెతుకుతున్నామని స్టేట్ మెంట్ ఇచ్చారు నిర్మాతలు.

'సీత' సినిమా నిర్మాతలు ఇటీవలే కంగన రనౌత్‌ని కాంటాక్ట్ అయ్యారట. 'తలైవి' సినిమాలో అద్భుతంగా నటించిందనే ప్రశంసలు, ఇప్పటికే నాలుగుసార్లు నేషనల్ అవార్డ్ అందుకోవడంతో కంగనాని 'సీత' పాత్రకి సెలక్ట్‌ చేశారట మేకర్స్. ఇక కెరీర్‌ మొత్తంలో లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అనిపించే సినిమాలు ఒకటో రెండో వస్తాయి. అందుకే కంగన కూడా ఈ ప్రాజెక్ట్‌ రాగానే వెంటనే ఓకే చెప్పేసిందట. త్వరలోనే ఈ సినిమా వెండితెరనెక్కే అవకాశముంది.

మొత్తానికి సీత చిత్రం తెరకెక్కించే విషయంలో హీరోయిన్ల ఇష్యూ హాట్ టాపిక్ గానే మారింది. మేకర్స్ నెటిజన్ల మాటలనే వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూద్దాం.. ఈ మూవీ ఏ మాత్రం సక్సెస్ సాధిస్తుందో.










మరింత సమాచారం తెలుసుకోండి: