టాలీవుడ్ లో ఫస్ట్ మాస్ హీరో ఎన్టీయార్ అయితే ఆ తరువాత చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ క్రిష్ణ గురించే. ఆయన హవా అలా సాగుతూండగానే చిరంజీవి సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక చిరంజీవి తరువాత రోజుల్లో మాస్ కే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఎదిగారు, తన సత్తా గట్టిగానే చాటారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అప్పటి సీనియర్ హీరోలు అందరితోనూ నటించారు. ఆయన క్రిష్ణతో కొత్త పేట రౌడీ, కొత్తల్లుడు మూవీస్ లో చిన్న పాత్రలలో నటించాక ఏకంగా క్రిష్ణతో కలసి తోడు దొంగలు అనే మూవీలో ఆయనతో  సరిసమానమైన హీరోగా నటించి ఆడియన్స్ మెప్పు పొందారు. ఇదే వరసలో మరో సినిమా ఈ ఇద్దరి కాంబోలో రావాల్సి ఉంది.

ఆ మూవీయే భోగీమంటలు. ఈ సినిమాను ప్రముఖ కధా రచయిత త్రిపురనేని మహారధి నిర్మించారు. ఈ మూవీకి విజయనిర్మల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరో క్రిష్ణ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటే అన్నతో సరిసమానంగా ఉండే తమ్ముడి పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్ర కోసం చిరంజీవిని సంప్రదించారుట నిర్మాతలు. క్రిష్ణతో తోడు దొంగలు హిట్ అయిన తరువాత  మరో మూవీ అని చిరంజీవి కూడా హ్యాపీగా ఒప్పుకున్నారుట.

అయితే అదే సమయంలో ఎన్టీయార్ తో కె రాఘ‌వేంద్రరావు తిరుగులేని మనిషి మూవీని నిర్మిస్తున్నారు. ఆ మూవీలో ఎన్టీయార్ బావ క్యారక్టర్ ఒకటి ఉంది. సినిమాను మలుపు తిప్పే ఈ రోల్ కి చిరంజీవిని అనుకున్నారు. పైగా ఎన్టీయార్ తో చిరంజీవికి ఫస్ట్ టైమ్ కాంబో. దాంతో ఆయన క్రిష్ణకు ఈ విషయాన్ని వివరించి భోగీమంటలు మూవీ నుంచి సున్నితంగానే తప్పుకున్నారుట. మొత్తానికి ఒకే టైమ్ లో ఇద్దరు అగ్ర నటుల సినిమాలు వరసగా రావడంటో చిరంజీవి క్రిష్ణతో అలా మంచి సినిమా చేయలేక మిస్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ తరువాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబోలో ఏ మూవీ రాలేదు. 1981లో విడుదల అయిన తిరుగులేని మనిషి తరువాత రెండేళ్ళకు వచ్చిన ఖైదీతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ రావడం, ఆయన స్టార్ డం సాధించడంతో సోలోగానే దూసుకుపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: