బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టిని త‌న భ‌ర్త పోర్న్ వీడియోల కేసుకు సంబంధించి పోలీసులు విచారించ‌గా ఆస‌క్తిక‌ర సమాధానాలు ఇచ్చింది. రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసు అధికారులు శిల్పా శెట్టిని ప‌లు కోణాల‌లో ప్ర‌శ్నించారు. అయితే తన భ‌ర్త ఏం చేస్తున్నాడ‌ని తాను ప‌ట్టించుకోలేద‌ని త‌న ప‌నిలో తాను బిజీగా ఉన్నాన‌ని శిల్పాశెట్టి స‌మాధానం ఇచ్చింది. శిల్పా శెట్టి స్టేట్మెంట్ ను మొత్తం 1400 పేజీల చార్జ్ షీట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన అలాగే రాజ్ కుంద్రా కంపెనీలు అయిన‌ వియాన్ ఇండ‌స్ట్రీస్..రియాన్ తోప్రే ల‌కు సంబంధించిన రికార్టుల‌ను కూడా పోలీసు అధికారుల‌తో స‌హా ఐటీ అధికారులు ప‌రిశీలించారు. ఇక రాజ్ కుంద్రా కేసులో కీల‌కంగా ఉన్న య‌శ్ ఠాకూర్, సందీప్ బక్షి ల‌కు సంబంధించి కూడా పోలీసులు కీల‌క ఆధారాల‌ను సేక‌రించారు. 

ఇదిలా ఉండ‌గా శిల్పాశెట్టి త‌న స్టేట్ మెంట్ లో 2015 లో రాజ్ కుంద్రా వియాన్ ఇండ‌స్ట్రీస్ ను ప్రారంబించార‌ని తెలిపింది. అయితే మొద‌ట ఆ కంపెనీలో తాను కూడా ఒక డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాన‌ని శిల్పాశెట్టి వెల్లించింది. కానీ కొన్ని ప‌ర్స‌న‌ల్ కార‌ణాల వ‌ల్ల 2020 సంవ‌త్సంరంలో డైరెక్ట‌ర్ స్థానం నుండి త‌ప్పుకున్నాన‌ని చెప్పింది. ఇక త‌న‌కు హాట్ షాట్స్ యాప్ గురించి..బాలీ ఫేమ్ యాప్ గురించి త‌న‌కు తెలియద‌ని శిల్పాశెట్టి వెల్లడించింది.

అంతే కాకుండా త‌న ప‌నుల్లో తాను బిజీగా ఉన్నాన‌ని రాజ్ కుంద్రా వ్య‌వ‌హారాల గురించి త‌న‌కు తెలియది శిల్పా శెట్టి చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక పోలీసులు చార్జ్ సీట్ లో రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల చిత్రీక‌ర‌న‌కు సంబంధించి వియాన్ ఇండ‌స్ట్రీస్ నుండే ప్ర‌తి రోజూ లావాదేవీలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా నింధితులు హాట్ షాట్స్ మ‌రియు బాలీఫేమ్ యాప్ ల‌లో పోర్న్ వీడియోల‌ను అప్లోడ్ చేశార‌ని పేర్కొన్నారు. ఈ కేసులో 42 మంది విట్నెస్ ను కూడా పోలీసులు సేక‌రించారు. ఇదిలా ఉండ‌గా రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ద‌కొండు మందిని అరెస్ట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: