మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు వచ్చారు. కొంతమంది తమ సొంత టాలెంట్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి రాగా... మరికొంత మంది వారసత్వం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అయితే వారసత్వంగా వచ్చిన హీరోలలో కొంతమంది విజయం సాధించారు. ఇలా హిట్టయిన హీరోల లిస్టులో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారు. మహేష్ బాబు... ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ తనయుడు. బాలనటుడిగా 8 సినిమాలు మరియు హీరోగా 25 సినిమాలకు పైగా చేశాడు మహేష్ బాబు.  

తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ సినిమా తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఆ తర్వాత 1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పోరాటం సినిమా కృష్ణకు తమ్ముడు గా కనిపించాడు మహేష్ బాబు. ఇలా... బాల నటుడి నుంచి పెద్ద హీరోగా ఎదిగాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా తో హీరోగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. చేసిన మొదటి సినిమా తోనే... ఉత్తమ నూతన నటుడు గా అవార్డు అందుకున్నాడు మహేష్ బాబు. ఆ తరువాత 2003 సంవత్సరం లో నిజం సినిమాకు మొదటిసారిగా నంది అవార్డు అందుకున్నాడు మహేష్.

అలాగే 2005 లో వచ్చిన అతడు సినిమా, 2011 సంవత్సరంలో వచ్చిన దూకుడు, 2015 సంవత్సరంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు. ఇలా వరుస విజయాలతో పరిశ్రమలో తండ్రిని మించిన తనయుడిగా మహేష్ బాబు  దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు అగ్రహీరోగా కొనసాగుతున్నారు. మహేష్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే... సినీ హీరోయిన్ నమ్రత శిరోద్కరన్ ను మహేష్ బాబు... ప్రేమించి పెళ్లి  చేసుకున్నాడు. మహేష్ బాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: