సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుల కు ఫ్యామిలీస్ నుండి వారసులు ఎంట్రీ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు వారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. కానీ అల్లు అర్జున్ హీరో ఏంటి అని అనుకున్నారు అందరు..  ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.  హీరో కొడుకు హీరోగానే ఎంట్రీ ఇస్తాడు..  కమెడియన్ కొడుకు కమెడియన్ గానే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడు అని ప్రేక్షకులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ తాత రామలింగయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత గొప్ప కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమకి వన్నె తెచ్చే విధంగా తన కామెడీతో నవ్వులు పూయించాడు రామలింగయ్య  ఇక ఆ తర్వాత రామలింగయ్య వారసుడిగా ఉన్న అల్లు అరవింద్ సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వకుండా కేవలం ప్రొడ్యూసర్ గా మిగిలిపోయారు. తర్వాత  ఒక కమెడియన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అదేంటి కమీడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కమెడియన్ గా రావాలి కానీ హీరో ఏంటి అని ప్రేక్షకులు  అనుకున్నారు.  అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా గంగోత్రి విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల్లో ఇదే భావన ఉండేది.



 కానీ గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుసగా చేసిన సినిమాలు చూసి కమెడియన్ ఫ్యామిలీ అయితే ఏంటి టాలెంట్ ఉండాలి గానీ హీరోగా రావచ్చు అని తెలుగు ప్రేక్షకులు భావించారు. ఇక అంతకంతకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.  ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్.  ఒకప్పుడు కమెడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడు హీరో ఏంటి అనుకున్న వారే.. హీరో అంటే అల్లు అర్జున్ లాగే ఉండాలి అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి: