‘బిగ్ బాస్’ షో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్లమందికి ఆనందాన్ని కలిగిస్తున్న రియాలిటీ షో మనదేశంలో కూడ అనేక భాషలలో ఈ షోకి సంబంధించిన అనేక సీజన్స్ ఇప్పటికే బుల్లితెర పై ప్రసారం అయి ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అలాంటి తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 5’ ఫెయిల్ అయిందా అంటూ అనేక సందేహాలు కలిగేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


వాస్తవానికి నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 5’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేటింగ్స్ బాగా రావడంతో ఈ సీజన్ కూడ బాగా సక్సస్ అవుతుందని భావించారు. అయితే జరిగిన వాస్తవం వేరు. ప్రస్తుతం సరైన సినిమాలు లేకపోయినా ఈ షోను చూసే వారి సంఖ్య చాల తక్కువగా ఉన్నట్లుగా రేటింగ్స్ వస్తున్నాయి అని టాక్.


దీనికికారణం ఈ షోలో ఉన్న హౌస్ మేట్స్ మొఖాలు ఎవరికీ పరిచయం లేకపోవడం అని అంటున్నారు. ‘బిగ్ బాస్ సీజన్ 4’ లో లవర్స్ డ్రామా బాగా వర్కౌట్ అయింది. అయితే అది అంతా ఉత్తితి స్క్రిప్ట్ డ్రామా అని బుల్లితెర ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. ఇప్పుడు అదే టైప్ లవర్స్ డ్రామా ను ఈ సీజన్ 5లో రిపీట్ చేస్తున్నప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోతున్నారు. దీనికితోడు ప్రస్తుతం స్టార్ మా టివి లో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్స్ చూసి అలిసిపోయిన బుల్లితెర ప్రేక్షకులు ఆ తరువాత చాల లేట్ గా ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్ సీజన్ 5’ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


దీనికితోడు నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో నాగ్ తన హోస్టింగ్ లో ప్రత్యేకత చూపించలేకపోతున్నాడని పైకి నాగ్ ఎంత యాక్టివ్ గా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నప్పటికీ ఎదో ఒక లోటు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాగ్ హోస్టింగ్ లో కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: