బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా నిర్ణయంపై స్పందించింది. టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం ప్రకటించాడు. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం చూసి అతని అభిమానులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని విరాట్ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ నేపథ్యంలో విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా ద్వారా సింబాలిక్ రియాక్షన్ ఇచ్చారు. అనుష్క శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. భర్త విరాట్ కోహ్లీ టీ 20 నుండి కెప్టెన్సీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో విరాట్ లేఖను పంచుకుంటూ దాని మీద లవ్ ఎమోజీని యాడ్ చేసి తన నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించింది. విరాట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ పై చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు. అక్టోబర్‌లో దుబాయ్‌లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ తర్వాత తాను టీ 20 కెప్టెన్సీని విడిచిపెడతానని విరాట్ కోహ్లీ రాశాడు.

"రబ్ నే బనా ది జోడి" సినిమాతో అనుష్క తన కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత బాలీవుడ్ లో వరుసగా స్టార్స్ తో జత కడుతూ స్టార్ హీరోయిన్ గా మారింది. సుదీర్ఘకాలం డేటింగ్ చేసిన తర్వాత అనుష్క శర్మ, విరాట్ 2017 లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 11 న అనుష్క శర్మ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు వామిక అనే పేరు పెట్టారు. పెళ్ళైన తరువాత అనుష్క నటనకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె నిర్మాతగా మారి సినిమా పరిశ్రమలో కొనసాగుతోంది. గత సంవత్సరం అనుష్క "పాతాల్ లోక్" అనే అమెజాన్ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. దీనికి చాలా మంచి స్పందన వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: