కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోలు కథలు విన్న తర్వాత, నచ్చలేదని చెప్పడం, ఆ కథలను మరో స్టార్ హీరో చేసి అత్యంత విజయాలను సాధించిన సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి . అలాంటి వారిలో బాలీవుడ్ టాప్ హీరోలుగా పేరు గాంచిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కండలవీరుడు గా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీసు వద్ద తన సినిమాలతో కలెక్షను ఎలా సాధిస్తూ వుంటాడో, ఇక అంతే స్థాయిలో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు..ఇక ఈయన కెరీర్లో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ, కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.. అయితే ఈయన దురదృష్టవశాత్తు వద్దనుకున్న కొన్ని చిత్రాలను, మరో స్టార్ హీరో షారుక్ ఖాన్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా  నిలిచాడు.. అంతేకాదు ఈ సినిమాలు ఆయన కెరియర్ లో సూపర్ హిట్ చిత్రాలుగా మిగిలిపోయాయి. అయితే ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..బాజిగర్:
షారుక్ ఖాన్ సినీ కెరియర్ లో అతి గొప్ప విజయం సాధించిన చిత్రాలలో బాజీగర్ కూడా ఒకటి. ఈ సినిమాను అబ్బాస్ మస్తాన్ తెరకెక్కించారు. ఇందులో శిల్పాశెట్టి , కాజోల్ కథానాయకులుగా నటించారు. రూ.2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 18 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా మొదట సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్లినప్పుడు, సల్మాన్ నాన్న అందులో కొంచెంనెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అని, కథ మార్చమని , తల్లి సెంటిమెంట్ ను కూడా జోడిస్తే బాగుంటుందని చెప్పాడట . కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు. తర్వాత షారుఖ్ ఖాన్ తో ఈ సినిమా తీస్తూ, తల్లి సెంటిమెంట్ ను జోడించడం కూడా జరిగింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ తెలిపి , తల్లి సెంటిమెంటును జోడించినా కూడా నేనేమీ పట్టించుకోలేదంటూ మీడియాకు చెప్పాడు.

ఇక ఈ సినిమా తో పాటు దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కల్ హో నా హో , జీరో, జోష్, చెక్ దే ఇండియా ఇలాంటి ఎన్నో సినిమాలను సల్మాన్ ఖాన్ వదులుకోవడంతో షారుఖ్ ఖాన్ చేసి మంచి విజయాన్ని సాధించాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: